NTV Telugu Site icon

IPL 2023 Final: నేడు ఐపీఎల్‌ ఫైనల్.. ఈ రోజు కూడా వర్షం పడితే జరిగేది ఇదే..

Ipl

Ipl

IPL 2023 Final: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.. అహ్మదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కాగా.. భారీ వర్షం ఆటను అడ్డుకుంది. వరుణుడు కరుణిస్తే తప్ప ఈ రోజు రాత్రి 7.30కు కిక్కిచ్చే ఫైనల్‌ ఫైట్‌ జరగదన్నమాట.. దీంతో.. ఈ రోజు మ్యాచ్‌ ఉంటుందా? లేదా? ఒకవేళ ఈ రోజు మ్యాచ్‌ రద్దు అయితే జరిగేది ఏంటి అనే చర్చ సాగుతోంది.. అహ్మదాబాద్‌లో జరిగాల్సిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్ భారీ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వాన పడుతూ, ఆగుతూ దోబూచులాడింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టీమ్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుందనుకున్న మ్యాచ్‌.. అసలు మొదలవకుండానే ఆగిపోయింది. ఒకవేళ రాత్రి తొమ్మిదిన్నరలోగా వర్షం తగ్గితే… మ్యాచ్‌ నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్‌ కూడా వేయలేదు.

Read Also: Astrology : మే 29, సోమవారం దినఫలాలు

కనీసం రాత్రి 11 గంటలకు వర్షం తగ్గినా.. ఓవర్లు కుదించి, విన్నర్‌ ఎవరనేది సస్పెన్షన్‌ లేకుండా తేల్చేయాలనుకున్నారు. అయితే భారీ వర్షానికి గ్రౌండ్‌ మొత్తం చెరువులా మారిపోయింది. వర్షపు నీరు గ్రౌండ్‌లో నిలిచిపోవడంతో.. దాన్ని క్లియర్‌ చేయడానికే సుమారు గంట సమయం పడుతుందని.. ఇక చేసేదేమి లేక ఆటను నిలిపివేశారు. దీంతో ఆటను రిజర్వ్ డేకు పోస్ట్‌ పోన్ చేశారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ ఫైనల్ నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఫైనల్ జరుగుతుందా..? లేదా అనే ఉత్కంఠ క్రికెట్‌ అభిమానుల్లో నెలకొంది. ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

Read Also: GSLV-F12: సవ్యంగా సాగుతోన్న కౌంట్‌డౌన్‌ ప్రక్రియ.. నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–12 ప్రయోగం

నిన్నటి లాగే ఎడతెగని వర్షం ఈరోజు కూడా కురిస్తే సూపర్‌ ఓవర్‌ ద్వారానైనా విజేతను ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక వేళ అదికూడా సాధ్యం కాకపోతే మాత్రం.. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో లీగ్‌లో ఉన్న మ్యాచ్‌ను ఛాంపియన్‌షిప్‌గా ప్రకటిస్తారు నిర్వాహకులు. అలా జరిగితే 14 మ్యాచ్‌ల్లో పది విజయాలు సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ, క్రికెట్‌ ప్రియులు మాత్రం మ్యాచ్‌ కచ్చితంగా జరుగుతుందనే దీమాతో ఉన్నారు. మరి ఈ రోజైనా వరుణుడు కరునిస్తాడా..? క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌ ఆస్వాదించేలా అవకాశం ఇస్తాడా? మ్యాచ్‌ జరిగితే గెలిచేది ఎవరు..? మిస్టర్‌ కూల్‌ తన సీనియార్టీని అంతా ఉపయోగించి మరోసారి కప్‌ అందుకుంటారా? దూకుడుగా ఉండే హార్ధిక్‌ పాండ్యా.. వరుసగా రెండోసారి గుజరాత్‌కు టైటిల్‌ అందిస్తాడా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.. సదరు క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. వరుణుడు కరుణించి.. మ్యాచ్‌ జరగాలని కోరుకుంటున్నారు.