DC vs GT: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి మొదట బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. డిపెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్‌నూ విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. చెన్నైపై ఐదు వికెట్ల విజయంతో తమ టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించారు. మరోవైపు దిల్లీ తొలి మ్యాచ్‌లో లఖ్‌నవూపై 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నేడు గుజరాత్‌తో జరగనున్న మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని చూస్తోంది.
అయితే.. అన్ని విభాగాల్లో రాణిస్తున్న హర్దిక్ పాండ్యజట్టుకు తొలి మ్యాచ్‌లో గాయం కారణంగా న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ దూరమవడం పెద్ద లోటే. అతడి స్థానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌తో భర్తీ చేశారు. మిల్లర్ రాకతో ఆ జట్టుకు మరింత బలం చేకూరింది. రిషబ్ పంత్ లేకుండా ఢిల్లీ బలహీనంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ లేని లోటును పూరించడానికి వారు పార్ట్ టైమ్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. రెండో విజయంపై గుజరాత్ కన్నేయగా…బోణి కొట్టాలని ఢిల్లీ ప్రణాళికతో బరిలోకి దిగింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఏ పక్షం ఆధిపత్యం చెలాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Touching Vehicles: ఓ వ్యక్తిపై 5 ఏళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధం.. ఎందుకో తెలుసా?
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రిలీ రొస్సో, అభిషేక్ పోరెల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రీచ్ నోర్ట్జే