Site icon NTV Telugu

IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

Rcbvsgt

Rcbvsgt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. అయితే వర్షం కారణంగా టాస్ వేయడం కాస్తా ఆలస్యం అయింది. ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ 18 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గుజరాత్‌పై ఆర్‌సీబీ గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే. ప్రస్తుతం వర్షం నిలిచిపోవడంతో టాస్ వేయగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది.

Also Read : IPL 2023 : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

మేము ప్రస్తుతం ఉన్న వాతావరణం చూశాము అందుకే ఫస్ట్ బౌలింగ్ చేయబోతున్నాం అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. మేము ఈ మ్యా్చ్ లో గెలిచి తమ జోరును కొనసాగిస్తామన్నాడు. మాకు ప్రస్తుతం ఈ మ్యాచ్ కీలకం.. మేం ఒకే జట్టుతో ఆడుతున్నాం.. ఎలాంటి మార్పులు లేవంటూ హార్థిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Also Read : Takkar Trailer: బొమ్మరిల్లు సిద్దార్థ్ ‘టక్కర్’ పనులు

మాకు ఈ మ్యాచ్ చాలా కీలకం ఎందుకంటే మేం ఈ గేమ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటామని ఆర్సీబీ సారథి ఫాప్ డుప్లెసిస్ అన్నాడు. మేము టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ తీసుకునే వాళ్లమని తెలిపాడు. కానీ ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని అన్నాడు. ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం.. కర్ణ్ శర్మ తప్పుకోవడంతో అతని స్థానంలో హిమాన్షు శర్మ వచ్చారు అని ఫాప్ డుప్లెసిస్ వెల్లడించాడు.

Also Read : Dinesh Gope: మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అరెస్ట్.. తలపై రూ.30 లక్షల రివార్డ్..

తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(w), హార్దిక్ పాండ్యా(c), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (w), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.

Exit mobile version