Gujarat cabinet: గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు. అయితే.. గుజరాత్ ప్రభుత్వం ఈరోజు ఉదయం 11:30 గంటలకు మంత్రి వర్గాన్ని విస్తరించనుంది. కొత్త మంత్రివర్గంలో 15 మంది కొత్త వ్యక్తులు సహా 25 మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మంత్రుల్లో కొందరు కొత్త లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. పార్టీ వర్గాలు, పలు జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. కొత్త మంత్రి వర్గంలో స్టార్ క్రికెటర్ జడేజా భార్య రివాబా జడేజాకు సైతం అవకాశం దక్కనుందని సమాచారం. కొత్త మంత్రుల పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం..
మంత్రి వర్గంలో కొత్త అభ్యర్థుల పేర్లు…?(విశ్వసనీయ వర్గాల సమాచారం)
– జితుభాయ్ వఘాని
– అర్జున్ మోద్వాడియా
– డాక్టర్ ప్రద్యుమ్న వాజా
– నరేష్ పటేల్
– రివాబా జడేజా
– అల్పేష్ ఠాకోర్
– ప్రవీణ్ మాలి
– అనిరుద్ధ్ దవే/అమిత్ థాకర్
– రమేష్ సోలంకి
– ఉదయ్ కాన్గర్
– జైరామ్ గవిత్
– పిసి బరందా
– కాంతిభాయ్ అమృతియా
– దర్శనా వఘిలా
తాజాగా రాజీనామా చేసిన అభ్యర్థుల్లో మళ్లీ మంత్రులుగా ఛాన్స్ లభించే అవకాశం ఉన్న ఎమ్మెల్యేల పేర్లు..
– రిషికేశ్ పటేల్
– కనుభాయ్ దేశాయ్
– కున్వర్జీ బవలియా
– బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్
– హర్ష్ సంఘ్వీ
– ప్రఫుల్ పన్సేరియా
6 మంది మంత్రులకు మళ్ళీ అవకాశం..?
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త మంత్రివర్గంలో దాదాపు 25 మంది మంత్రులను చేర్చుకోవచ్చు. ప్రస్తుత మంత్రివర్గం నుంచి దాదాపు 6 మంది మంత్రులకు మళ్లీ అవకాశం లభించవచ్చు. మరోవైపు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా గురువారం సాయంత్రం గాంధీనగర్ చేరుకుని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. శుక్రవారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
