NTV Telugu Site icon

Gujarat : పోర్న్ సైట్లు, న్యూడ్ ఫోటోలు.. ఇలాంటి పార్టనర్ వద్దని పోలీసుల చెంతకు చేరిన భార్య

Crime Against Women

Crime Against Women

Gujarat : పెళ్లయ్యాక ఆ అమ్మాయి నమ్మకంతో భర్త ఇంటికి వస్తుంది. ఆమె తన భర్తపై ఎలాంటి ప్రేమను చూపిస్తోందో అలానే తన భర్త నుంచి ఆశిస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ పెళ్లిలో వీరి మధ్య నమ్మకం మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు భాగస్వామి గురించి ముందే తెలుసు. కానీ కొన్నిసార్లు అతి విశ్వాసంతో తన జీవిత భాగస్వామి చేతిలో మోస పోవచ్చు కూడా. అలాంటి షాకింగ్ కేసు ఒకటి అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. విశాల్ భావ్‌సర్ అనే వ్యక్తిని నరోడా పోలీసులు అరెస్ట్ చేశారు. విశాల్ భావ్‌సర్ తన భార్యతో కలిసి చేస్తున్న పనులు చాలా షాకింగ్ కలిగించాయి. ఇవి వివాహ వ్యవస్థపై ఒకరి విశ్వాసాన్ని పోగొట్టేలా అనిపించాయి.

భర్తపై వచ్చిన ఆరోపణ ఏంటి?
భార్యకు ఇష్టం లేకున్నా తన శీలాన్ని విక్రయించాలని భావించాడు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా, పోర్న్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై మే 18న పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై దాడి, చిత్రహింసలు, నేరపూరిత కుట్ర, సమాచార సాంకేతిక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read Also:Urvashi Rautela: మొన్న రూ. 200కోట్ల నెక్లెస్.. నేడు రూ.190 కోట్ల బంగ్లా.. పాపకు అంత సీన్ ఉందా..?

వీరిద్దరూ ఎక్కడ ఎప్పుడు కలిశారు?
ఫిర్యాదు చేసిన మహిళ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని తన తండ్రి ఇంట్లో ఉంటోంది. ఆమె 2016లో ముంబైలో తొలిసారిగా విశాల్ భావ్‌సర్‌ను కలిసింది. వారి పరిచయం ప్రేమగా మారింది. ఆమె 2018లో అహ్మదాబాద్‌కు వచ్చింది. విశాల్‌ని పెళ్లి చేసుకుంది. విశాల్ భావ్‌సర్‌కు వ్యవసకారి. జూదంలో అతడికి మంచి పేరుంది. జూదంలో ఓడిపోయినప్పుడు తీవ్రంగా కొట్టేవాడని అతని భార్య పోలీసుల ముందు వాపోయింది.

భార్యను వేరే వాళ్ల వద్దకు పంపేవాడు
2021లో విశాల్ భావ్‌సర్ జూదంలో భారీ నష్టాన్ని చవిచూశారు. ఆ తర్వాత భార్యను వేరే వాళ్ల దగ్గరకు పోవాలని ఒత్తిడి చేశాడు. తనను నిరాకరించే సరికి కూతుర్ని చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత భార్య అయిష్టంగానే అతని మాట వినడం ప్రారంభించింది. విశాల్ భావ్‌సర్ తన స్నేహితులను, ఇతర వ్యక్తులను తన ఇంటికి పిలిచి తన ఇష్టానుసారం చేయమని బలవంతం చేసేవాడు. కొన్నిసార్లు ఇతర వ్యక్తుల వద్దుకు కూడా పంపించేవాడు. వీటన్నింటినీ తట్టుకోలేని భార్య నిలదీయడంతో విడాకుల పత్రాలపై సంతకం చేయమని ఒత్తిడి చేశాడు.

Read Also:TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. మరో విడత డీఏ చెల్లింపు

పోర్న్ సైట్‌లో ఫోటోలతో భార్య మొబైల్ నంబర్
నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత ఢిల్లీలో స్నేహితుడితో కలిసి ఉంటోంది. బాలికను తనకు అప్పగించేందుకు భర్త సిద్ధంగా లేడని బాధితురాలు తెలిపింది. భర్త తన ఫొటోలను ఉపయోగించి మార్ఫింగ్ సాయంతో న్యూడ్ ఫొటోలు రూపొందించి తన స్నేహితులకు పంపించాడని బాధితురాలు ఆ తర్వాత గ్రహించింది. పోర్న్ సైట్‌లో ఈ ఫోటోలతో పాటు ఆమె మొబైల్ నంబర్ కూడా అప్‌లోడ్ చేయబడింది.

Show comments