Site icon NTV Telugu

Guinness World Record: ఎత్తు, వెడల్పులతో ప్రపంచ రికార్డును సృష్టించిన ఎద్దు.. వివరాలు ఇలా..

World's Tallest Cow 'romeo'

World's Tallest Cow 'romeo'

కొన్ని సందర్భాలలో ప్రపంచ రికార్డులను కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా సృష్టిస్తాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు లిఖించుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. 6 సంవత్సరాలున్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డ్ సృష్టించింది. అమెరికా లోని ఒరెగాన్‌ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే ‘రోమియో’ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ఆ ఎద్దును చూడగానే ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. అయితే ఈ ఎద్దు స్వతహాగా చాలా సౌమ్యంగా ఉంటుందని చూసుకొనే వారు చెబుతున్నారు.

Auto House: ఆటోను ఇంటి పైకి ఎక్కించేసిన డ్రైవర్.. అలాఎందుకు చేసాడంటే..

ఇక ఈ విషయం సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో 1. 94 మీటర్ల (6 అడుగుల 4.5 అంగుళాలు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దు రోమియోని మనం చూడవచ్చు. ఈ ఎద్దు యజమాని మిస్టీ మూర్‌. వీరు వెల్‌కమ్ హోమ్ యానిమల్ శాంక్చురీలో 6 ఏళ్ల నుండి ఉంటున్నారు. ఇక ఈ వీడియోలో నల్లటి ఎద్దుకు ఓ మహిళ అరటిపండు తినిపిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు.

ఇక రోమియో ఆహారాన్ని బాగా ఇష్టపడుతుంది. ముఖ్యంగా ఆపిల్, అరటిపండ్లు లాంటి తినుంది. ఈ ఎద్దు ప్రతిరోజూ 45 కిలోగ్రాముల ఎండుగడ్డి, అలాగే ధాన్యాలు, ఇతర ఆహారాన్ని కూడా తినగలదు.

Exit mobile version