NTV Telugu Site icon

TG Govt: కొత్త రేషన్ కార్డుల కోసం మార్గదర్శకాలు విడుదల..

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈనెల 26 నుంచి రేషన్ కార్డుల మంజూరుకు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అర్హత ప్రమాణాల పరిశీలనకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను తయారు చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యత వహించనున్నారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి చర్చించిన తర్వాతనే ఆమోదం తెలపనున్నారు. మరోవైపు.. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపులకు అవకాశం కల్పించనున్నారు. అర్హత కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనుంది పౌరసరపరఫరాల శాఖ.

Show comments