MLA Varaprasad Rao Meets Purandeswari: పురంధేశ్వరితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Varaprasad Rao Meets Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు తర్వాత ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి.. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, నేతలు.. పార్టీ అధ్యక్షులను కలుస్తూ వస్తున్నారు.. ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాద్.. వైసీపీకి రాజీనామా చేసిన వరప్రసాద్.. ఇటీవలే జనసేనాని పవన్ కల్యాణ్‌ని కలిశారు.. అయితే, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.. దీంతో ఈ రోజు ఆయన పురంధేశ్వరితో సమావేశం అయ్యారు.. పొత్తు అనంతరం బీజేపీ నుంచి తిరుపతి లోక్‌సభ సీటును ఆశిస్తున్నారట వరప్రసాద్.. అంతేకాదు.. గతంలో తిరుపతి ఎంపీగా వైసీపీ తరఫున గెలిచారు వరప్రసాద్.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు మార్పులు, చేర్పులు.. కొందరు సిట్టింగులకు సీట్లు లేకుండా చేశాయి.. దీంతో.. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనతోకి టచ్‌లోకి వెళ్లినా.. ఇప్పుడు పొత్తుల అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిని కలవడం చర్చగా మారింది.. ఇక, తిరుపతి పార్లమెంటు పరిధిలో వరప్రసాద్ కు ఉన్న బలం.. బలగం పై పురంధేశ్వరి, బీజేపీ ఎన్నికల సమన్వయకర్త శేఖర్ జీతో చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.
Read Also: Upasana Konidela : అయోధ్యలో అపోలో హాస్పిటల్ సేవలు ప్రారంభించిన ఉపాసన
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
తాజావార్తలు
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!