జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి మీద చంద్రబాబు వ్యాఖ్యలు హేయమైనవని, ప్రజాస్పందనతో వున్న జగన్మోహన్ రెడ్డి సింపతీ కోసం ప్రయత్నం చేయాలిసిన అవసరం లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాజువాక మీటింగ్ లో తనపై తానే రాయి వేయించుకుని ప్రచారం కోసం వాడుకుంటున్న నాయకుడు చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. రాయి చుట్టూ ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించే ప్రయత్నంలో చంద్రబాబు వున్నాడని, రాళ్ళు విసిరితే నో….దాడి చేస్తెనో ఇంట్లో కూర్చునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదన్నారు. వంగవీటి రంగా దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీవి హత్య రాజకీయాలు అని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా..’నేను బ్యాక్ డోర్ పొలిటీషియన్ ని కాదు…..మూడో తరం రాజకీయ వారసత్వం నాది… గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భూములు ఇచ్చింది మా కుటుంబం….నీ కొడుకు రీల్స్ చూసుకుని కూర్చునే ఒక అసమర్థుడు… చంద్రబాబు, లోకేష్ కు ఇదే నా ఓపెన్ ఛాలెంజ్.. చలి కారణంగా దావో స్ వెళ్ళ లేదని నేను చెప్పినట్టు నిరూపిస్తే పోటీ నుంచి స్వచ్ఛందంగా త ప్పుకుంటాను. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీ.. కరణ వ్యతిరేక పోరాటం మా విధానం…..గాజువాక వచ్చి tdp వైఖరి ఏంటో చెప్పకుండా వెళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబు….. గాజువాకలో టీడీపీకి ఓట్లేస్తే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు ప్రజలు ఆమోదించారని చెప్పుకుని వ్యక్తి చంద్రబాబు…. టీడీపీ హయాంలో వచ్చిన ఉద్యోగాలు, పెట్టుబడుల కంటే మూడు రెట్లు అధికంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది…. 10ఫిషింగ్ హార్బర్ లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మా ప్రభుత్వంలో వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళ దాడి చంద్రబాబు పనేనని అందరికీ తెలుసు…. రాళ్ళు దాడిని దారి మళ్లించేందుకు పవన్ కళ్యాణ్. చంద్రబాబు వాళ్ళ మీద వాళ్ళే రాళ్ళు చేయించుకుంటున్నారు…. దాడి ఎవరు …ఎవరి మీద చేసిన ఖందించాల్సిందే….. కానీ హేళన పూరిత వ్యాఖ్యలు కరెక్ట్ కాదు…’ అని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
