NTV Telugu Site icon

Gudivada Amarnath : పవన్ కల్యాణ్ రాజకీయాన్ని వెబ్ సిరీస్ అనుకుంటున్నారు

Gudivada Amarnath

Gudivada Amarnath

వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ప్రముఖ పర్యాటక కేంద్రం ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించనున్న ఒబెరాయ్ హోటళ్లకు కూడా వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో అనేక MOU లు చేసుకున్నామన్నారు. 13 లక్షల పెట్టుబడులు, 6 లక్షల మంది కి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఒప్పందం చేసుకున్నామని, టూరిజం కి సంబంధించిన 5 స్టార్+ రిసార్ట్స్ హోటల్స్ గండికోట, భీమిలి, తిరుపతి వద్ద Mou చేసుకున్నామని తెలిపారు. ఇవే ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని, ఈ ప్రాజెక్టు రాకతో ఏపీ కి మరింత ప్రఖ్యాత చెందుతుందన్నారు.

Also Read : Indore: ఇండోర్‌లో గిరిజన యువకుల బందీ, దాడి కేసులో ముగ్గురు అరెస్టు… ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

అంతేకాకుండా.. ‘విశాఖ ఒడ్డున ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నవి వస్తె మరింత బాగుంటుంది. అరకు లో ఒబారెయ్ ఆధ్వర్యంలో మంచి 5 స్టార్+ రిసార్ట్ ప్రారంభించిననున్నారు. ఏయే MOU లు చేసుకున్నామో.. అవి అన్నీ మొదలు అవుతున్నాయి. మూడు పోర్టులు కూడా సిద్దం అవుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రాజెక్ట్స్ కార్యాచరణ పరిశీలిస్తున్నారు. కొన్ని పత్రికలలో కడుపు మంటతో తప్పుడు కథనాలు రాస్తున్నారు. జాకీ లు పెట్టీ చంద్రబాబు నాయుడు నీ లేపే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని వెబ్ సిరీస్ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా లలో హీరో.. కానీ రాజకీయాలలో సైడ్ క్యారక్టర్. నీ సినిమాలో విలన్ చంద్ర బాబు నాయుడు. మొన్నటి వరకు పార్ట్-1 అయింది.. ఇప్పుడు వారాహి పార్ట్-2 అంట. 2019 ఎన్నికల రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుంది చంద్ర బాబు నాయుడు ని భుజాల మీద మొయ్యడనికి ఓ రాజకీయ పార్టీ అవసరమా పవన్ కల్యాణ్. నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భార్యతో విడిపోయారు అని వార్త వస్తే వెంటనే భుజాలు తడుముకునీ ఒక ఫోటో విడుదల చేశారు అంటూ గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శలు చేశారు.

Also Read : Srilanka: సంక్షోభ శ్రీలంకకు ఇండియా సాయం.. 4 బిలియన్ల అమెరికన్‌ డాలర్ల ఆర్థిక, మానవతా సాయం