ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. బయటికి మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ మొదట్లోనే ఇద్దరి ఓపెనర్స్ ను త్వరగా కోల్పోయింది. మొదటి ఓవర్ లోనే వృద్దమన్ సాహా 5 పురుగులకే వెనుతిరగగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగులకి వెనుతిరిగారు. ఆ తర్వాత గ్రీజు లోకి వచ్చిన సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగి స్కోర్ బోర్డ్ పై పరుగుల వరద సృష్టించారు.
Also read: Ahmedabad: మైనర్ బాలికని లేపుకెళ్లిన యువకుడు.. బాలిక కుటుంబం చేతిలో తల్లి హతం..
ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ 49 బంతులలో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 84 పరుగులతో అజయంగా నిలిచాడు. షారుక్ ఖాన్ 30 బంతులలో 58 పరుగులు చేసి టీంకు వెన్నుముకగా నిలబడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన డేవిడ్ మిల్లర్ 19 బంతులలో 26 పరుగులను చేసి అజేయంగా నిలిచాడు.
Also read: Kalki 2898 AD: “కల్కి” నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ డీటైల్స్ ఇదిగో..
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, గెలన్ మ్యాక్స్వేల్ చెరో వికెట్ను తీశారు.