GST Impact in AP: జీఎస్టీ ప్రభావంతో ఏపీలో వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. కొత్త పన్ను విధానంతో ప్రజలకు ఊరట లభించింది. రోజుకి 4 వేల రిజిస్ట్రేషన్ల దిశగా రాష్ట్రం ముందడుగేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి స్పందించారు. రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారన్నారు రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయని వెల్లడించారు. . కొత్త జీఎస్టీ వల్ల రిజిస్ట్రేషన్ లో వేగం పెరుగుతుందని చెప్పారు.
READ MORE: Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. వివరాలు ఇలా.!
సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు చేసిన వాహనాల జాబితా..
మోటార్ సైకిళ్లు: 2,352,
కార్లు/క్యాబ్‌లు :241,
ట్రాక్టర్లు 60, ఆటోలు: 227
గూడ్స్ వాహనాలు: 47,
ఆటో, గూడ్స్ వాహనాలు: 50
ఇతర వాహనాలు: 12
కాగా.. వంటగది సరకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు సోమవారం నుంచి తగ్గాయి. జీఎస్‌టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఈనెల 22 నుంచి తగ్గించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్‌లపై కొత్త ధరలు ముద్రించకున్నా.. విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. హెల్త్‌క్లబ్‌లు, సెలూన్లు, వ్యాయామ-యోగా కేంద్రాలపై; ఫేస్‌పౌడర్, షేవింగ్‌క్రీమ్, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5 శాతానికి తగ్గించింది. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్‌టీ 28% నుంచి 40 శాతానికి పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ఇటీవల పేర్కొనడం గమనార్హం.
