NTV Telugu Site icon

Police Treatment: దారుణం.. బాలుడిని అతని నానమ్మను చితకబాదిన పోలీసులు..(వీడియో)

Police

Police

Police Treatment: మధ్యప్రదేశ్‌ లోని కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళను, మైనర్‌ యువకుడిని కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దొంగతనం చేశారనే అనుమానంతో ఓ మహిళను, మైనర్ యువకుడిని ఓ మహిళా పోలీసు కిరాతకంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొదట ఆమె ఆఫీస్ రూమ్ తలుపు మూసివేసి, ఆ మహిళను కర్రతో చాలాసార్లు కొట్టింది. బాధిత మహిళ నేలపై పడిపోయిన సమయంలో, ఆమె మైనర్ బాలుడిని కొట్టడం మొదలు పెట్టింది. ఆ తర్వాత పోలీసు సిబ్బంది మహిళని, బాలుడిని దారుణంగా కొట్టారు. మహిళను, ఆమె మనవడిని దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో, ప్రజలు సోషల్ మీడియాలో పోలీసులపై ఆగ్రహం తెలుపుతున్నారు.

Egg For Good Health: గుడ్డు వెరీ గుడ్.. ప్రతిరోజు గుడ్డు తింటే ఇన్ని మార్పులా..

కట్ని GRP పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝరా తికురియా నివాసితులు 15 ఏళ్ల దీప్రాజ్ వాన్ష్కర్, అతని నానమ్మ కుసుమ్ వంశ్కర్ లను కట్ని GRP పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరుణ వాహనే, అలాగే సబార్డినేట్ పోలీస్ స్టేషన్‌ లోని SHO గదిలోనే దారుణంగా కొట్టారు. దొంగతనం చేశారనే అనుమానంతో పోలీసులు తనని, నానమ్మను విచారణలో దారుణంగా కొట్టారని బాధితుడు మైనర్ బాలుడు చెప్పాడు. ఇక ఈ వీడియోను ఎంపీ కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ చేసింది. వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు.. మధ్యప్రదేశ్‌లో ఏమి జరుగుతుందో చెప్పడానికి మీకు సమాధానం ఉందా.? శాంతిభద్రతల పేరుతో గూండాయిజం చేస్తూ మనుషులను చంపేందుకు మీ పోలీసులు పూనుకున్నారు. కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల పిల్లాడిని, అతని అమ్మమను స్టేషన్‌ ఇన్‌చార్జి, పోలీసులు చేసిన దారుణం ఆత్మ కలకలం రేపుతోంది. ఇంత ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. మీ ఉదాసీనత వల్లనా..? లేక ఇలాంటి చర్యకు అనుమతి ఇచ్చారా..? అంటూ తెలిపారు.