Site icon NTV Telugu

Elon Musk: పెరుగుతున్న భారత సంతతికి చెందిన సీఈఓలపై ఎలాన్ మస్క్ కామెంట్స్

Musk

Musk

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు భారత సంతతికి చెందిన వారు సీఈవోలుగా, ఇతర ఉన్నత పదవులను పొందుతున్నారు. దీనిపై బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ వేదికగా గతంలో దీని గురించి ఆయన కామెంట్స్ చేశాడు. చాలా మంది భారతీయ సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్‌లు ప్రస్తుతం అనేక టెక్, నాన్-టెక్ కంపెనీలలో ఉన్నత స్థానాలను కలిగి ఉన్నారు.. వారి జాబితా ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది అని ఆయన తెలిపారు.

Read Also: CPI Narayana : బీజేపీనే దేశంలో అల్లర్లకు మతతత్వ ఆందోళనలకు ఆద్యం పోసింది

ఇక, వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పోస్ట్ చేసిన పోస్ట్‌పై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇది భారతీయ సంతతి వ్యక్తులను అగ్రస్థానంలో ఉన్న కంపెనీల సుదీర్ఘ జాబితాను కలిగి ఉంది.. వీటిలో సుందర్ పిచాయ్ తలపెట్టిన ఆల్ఫాబెట్ కూడా ఉంది అని తెలిపాడు. మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, అడోబ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.. సత్య నాదెళ్ల, నీల్ మోహన్, శాంతను నారాయణ్ టెక్ దిగ్గజాలకు నాయకత్వం వహిస్తున్నారు అని మస్క్ చెప్పుకొచ్చారు.

Read Also: Meruga Nagarjuna : దొంగ ఓట్లతో గెలవాలని చూస్తే ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు

అయితే, ప్రపంచ బ్యాంక్ కు 14వ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా కూడా ఈ జాబితాలో ఉన్నారు అని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తెలిపారు. స్టార్‌బక్స్, కాగ్నిజెంట్, మైక్రోన్ టెక్నాలజీ చీఫ్‌లు లక్ష్మణ్ నరసింహన్, రవి కుమార్ ఎస్, సంజయ్ మెహ్రోత్రా కూడా ఈ లిస్ట్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చానెల్ యొక్క గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీనా నాయర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంతతి కార్పొరేట్ బాస్‌ల ర్యాంక్‌లలో కూడా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.

Read Also: Viral video: ప్రాణాపాయంలో ఉన్న చిరుతను కాపాడిన వ్యక్తి.. చివరికి అది ఏం చేసిందంటే?

ఈ ఏడాది జూన్‌లో న్యూయార్క్‌లో ప్రధాని నరేంద్ర మోడీని టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ కలిసిన తర్వాత భారతదేశాన్ని సందర్శించాలని తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పీఎం మోడీ తనకు ఆహ్వానం పంపారా అని అతడు అడిగారు. దానికి భారత్ తరపున ఆహ్వానం పంపించారు. టెస్లా కంపెనీని భారతదేశంలో స్థాపించే యోచనలో ఉన్నట్లు మస్క్ పేర్కొన్నారు. అందు మూలంగానే అతడు భారత దేశ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించాడు.

Exit mobile version