NTV Telugu Site icon

APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల..

Appsc

Appsc

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. రెండు పేపర్ల ‘కీ’ లు ఏపీపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. అభ్యర్థుల అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ నెల 25 నుంచి 27 వరకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లింక్ ద్వారా మాత్రమే పంపాలని ఏపీపీఎస్సీ సూచించింది. అలా కాకుండా వాట్సాప్, పోస్ట్, ఎస్ఎంఎస్, ఫోన్, నేరుగా వచ్చిన స్వీకరించబడవు అని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గడువు తర్వాత అభ్యంతరాలు కూడా స్వీకరించబడవని ప్రకటనలో తెలిపింది. http://psc.ap.gov. in సైట్‌లో ఆన్ లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.

Read Also: Group 2 Mains: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు.. 92 శాతం హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు.. మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459 మంది ఉన్నారు. 80 వేలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు సమాచారం.

Read Also: Virat Kohli: రికార్డుల పరంపర.. ఆ హిట్ లిస్ట్‌లోకి కోహ్లీ