Group 2 Exam: గ్రూప్-2 పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా ప్రారంభానికి ముందే ఓ అభ్యర్థి ఫోల్డెడ్ మొబైల్ ఫోన్‌ను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చాడు. అనుమానం రావడంతో ఎగ్జామ్ చీఫ్ సూపరిండెంట్ అతడిని చెక్ చేశాడు. ఆ అభ్యర్థి ఫోన్ దొరకడంతో పరీక్ష రాయనివ్వకుండా అతడిని పోలీసులకు అప్పగించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు మేరకు, మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అతనిపై చర్యలు ఉంటాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.
Read Also: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..
ఇదిలా ఉండగా.. గ్రూప్-2 విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధనం కొంపముంచింది. నిమిషం నిబంధనతో కొందరు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. తెలంగాణలో ఇవాళ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు మొదటి పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అయితే కొందరు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.