గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఏపీపీఎస్సీ ఇదివరకే స్పష్టం చేసింది.
Read Also: Siddham Sabha: మేదరమెట్లలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు
మరోవైపు.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష నియమాలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. ఎవరైనా నియమ, నిబంధనలు పాటించకుంటే తగిన చర్యలు తీసుకోనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది. మార్చి 17వ తేదీన నిర్వహించే ప్రిలిమ్స్ రెండు పేపర్లలో ప్రశ్నల సరళి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్ రాసేందుకు అనుమతిస్తారు. మెయిన్స్‌లో ప్రతిభకనబరచిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
Read Also: Somireddy: కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ను పూర్తిగా మూసివేస్తున్నారు..