NTV Telugu Site icon

Group-1 Hall Tickets: గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఇదిగో లింక్..!

Group 1

Group 1

జూన్ 11న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ ను ఇవాళ విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిసన్ ( TSPSC ) ప్రకటించింది. హాల్ టికెట్లు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అక్టోబర్ 16, 2022న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం ముందుగా జారీ చేయబడిన హాల్ టిక్కెట్లు, తరువాత రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఆ తరువాత జూన్ 11న జరగబోయే పరీక్షకు చెల్లుబాటు కావని వెల్లడించింది. కాగా అభ్యర్థులు కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

Also Read: Death Penalty: దేవుడిని తిట్టిన యువకుడు.. మరణ శిక్ష వేసిన పాకిస్తాన్ కోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల కోసం 3 లక్షల 80 వేల 202 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే వెబ్‌సైట్‌లో నమూనా ఓఎంఆర్‌ షీట్‌ అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

Also Read: Chiru: మీ స్వాగ్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్…

జూన్ 11 ( ఆదివారం ) ఉదయం 10: 30 నుంచి మధ్యహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని అనితా రామ్ చంద్రన్ తెలిపారు. కాగా, 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయని ఈసారి పటిష్టంగా పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. గతంలో 1,040 సెంటర్లలో పరీక్ష నిర్వహించామని ఈసారి అందులో మార్పులు చేర్పులు చేశామని అధికారులు వెల్లడించారు.

Also Read: Odisha Train Accident: హృదయ విదారకం.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బైడెన్‌ దిగ్భ్రాంతి

గ్రూప్-1 హాల్ టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
1. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
2. అధికారిక లింక్‌కి నావిగేట్ చేసి, నోటిఫికేషన్ బార్‌పై క్లిక్ చేయాలి.
3. తర్వాత గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.
4. హాల్ టికెన్‌ డౌన్‌లోడ్ అయిన తర్వాత, పరీక్ష తేదీకి సంబంధించిన సూచనలను ఒకసారి చదవండి.
5. గ్రూప్-1 సిలబస్, పరీక్షా సరళి, సిలబస్ అంశాలు, ఇతర ముఖ్యమైన సూచనలను తనిఖీ చేసుకోండి.