Chiru: మీ స్వాగ్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ అద్భుతంగా చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యంగ్ హీరోస్ అందరూ చాలా మంచి డాన్సర్స్. అయితే ఎవరు ఎన్ని చేసినా స్వాగ్, గ్రేస్ విషయంలో మెగాస్టార్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్ అనే చెప్పాలి. ఆయన డాన్స్ అద్భుతంగానే కాదు అందంగా వేస్తాడు, అందుకే చిరు మిగిలిన హీరోలకన్నా చాలా స్పెషల్. ఏజ్ తో సంబంధం లేదు, ఆయన డాన్స్ వేస్తే ఆడియన్స్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది వాల్తేరు వీరయ్య సినిమాలోని డోంట్ స్టాప్ డ్యాన్సింగ్, వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్స్… ఈ రెండు పాటలు మెగా అభిమానులకే కాదు తెలుగు సినీ అభిమానులందరికీ కిక్ ఇచ్చాయి. లేటెస్ట్ గా చిరు డాన్స్ గ్రేస్ ని ఒక చిన్న స్టెప్ తోనే చూపిస్తూ భోళా మేనియా సాంగ్ ప్రోమో బయటకి వచ్చింది. ఈరోజు సాయంత్రం భోళా మేనియా ఫుల్ సాంగ్ బయటకి రానుంది, ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపిస్తూ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. చిరు ఈ ప్రోమోలో సూపర్ ఉన్నాడు. ఒక పదేళ్ల క్రితం చిరు ఎలా ఉన్నాడో ఈ ప్రోమోలో అచ్చం అలానే ఉన్నాడు.
ఈ సాంగ్ తో మెగా ఫెస్టివల్ ని స్టార్ట్ చేయడానికి మహతి స్వర సాగర్ రెడీగా ఉన్నాడు. ఆ స్టైల్ అండ్ స్వాగ్ ఎన్ని ఏళ్లు అయినా మెగాస్టార్ నుంచి పోదనే మాటని నిజం చేసేలా ఈ ప్రోమో ఉంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ భోళా మేనియా సాంగ్ లో సూపర్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఆ టాక్ ని ఈ ప్రోమో ప్రూవ్ చేసింది. మరి శేఖర్ మాస్టర్ స్టెప్స్, చిరు గ్రేస్, మహతి స్వర సాగర్ కంపొజిషన్ అన్నీ కలిసి ‘భోళా మేనియా’ సాంగ్ ని ఎంత స్పెషల్ గా మార్చనున్నాయో చూడాలి. తమిళ వేదాలమ్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 11న రిలీజ్ కానున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ‘భోళా మేనియా’ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు.
Also Read
- The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో 'ది ప్యారడైజ్'!
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- Kajal Aggarwal-Ramayana: 'రామాయణ'లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
Let the #BholaaMania begin in every Area😎
Full Lyrical Releasing Today @ 4:05 PM💥
MEGA🌟@KChiruTweets as #BholaaShankar 🔱 in @MeherRamesh's Stylish Mass Presentation🔥@SagarMahati thumping musical🥁@AnilSunkara1 @dudlyraj @ramjowrites… pic.twitter.com/B9wO5ZnMSy
— AK Entertainments (@AKentsOfficial) June 4, 2023
తాజావార్తలు
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!