Site icon NTV Telugu

Group 1 Exam : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

Group 1 Exam

Group 1 Exam

తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే.. ఈ సందర్భంగా పరీక్ష రాసిన అభ్యర్థులు మాట్లాడుతూ.. గతంలో గ్రూప్ 1 పరీక్ష కంటే ఈసారి పేపర్ ఈజీగా వచ్చిందని ఆయన అన్నారు. ఔటాఫ్ సబ్జెక్ట్ ప్రశ్నలు రాలేదన్నారు. పరీక్ష హాల్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇన్విజిలేటర్ ఫోన్లను కూడా లోపలికి అనిమతించ లేదని అభ్యర్థులు తెలిపారు. ఇప్పుడు జరిగిన గ్రూప్ 1 లో ఎక్కువ మంది మంచి మార్కులు సాధించే అవకాశం ఉందని పరీక్ష రాసిన అభ్యర్థులు వెల్లడించారు.

Also Read : Toll Tax Hike: మళ్లీ పెరిగిన టోల్ ట్యాక్స్.. అమల్లోకి కొత్త ధరలు

కాగా పేపర్ లీకేజీ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈసారి ఆఫ్‌లైన్‌ పద్ధతిలో, ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ జారీ చేశారు. అక్టోబర్‌ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌ పరీక్షలకు 25,050 మంది అభ్యర్థులను కమిషన్ ఎంపిక చేసింది. అభ్యర్థులు షూలు ధరించి రావొద్దని.. చెప్పులను ధరించే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని అధికారులు సూచించారు. గోరింటాకు, టాటూలతో రావొవద్దని స్పష్టం చేసింది. వాచీలు కూడా అనుమతించమని కమిషన్ స్పష్టం చేసింది.

Also Read : Post office franchise: రూ.5000వేలతో పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోండి.. నెలకు లక్ష సంపాదించండి

Exit mobile version