Suresh Gopi: కేంద్ర మంత్రి పదవికి రాజీనామాపై క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి గెలిచిన ఒకే ఒక్కడైన బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపికి అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేరళలో త్రిసూర్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన మొదటి బీజేపీ ఎంపీ సురేషే. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై విజయం సాధించారు. అయితే ఆయన ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కొన్ని గంటలైనా గడవక ముందే సురేష్ గోపి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. తన రాజీనామాపై తప్పుడు కథనాలు ప్రచురిస్తు్న్నాయని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో పని చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మోడీ కేబినెట్లో ఉండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా కేరళ అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Actor Arrested: నాలుగేళ్ల బాలిక రేప్ .. పోక్సో యాక్ట్ కింద ‘దృశ్యం’ నటుడు అరెస్ట్?
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
ఆదివారం మోడీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కింది. ప్రధానితో సహా కేబినెట్ మంత్రిగా సురేశ్ గోపి ఆదివారం ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని.. ఎంపీగా కొనసాగడమే ఇష్టమని ఆయన తెలిపినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. తన అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని.. తుది నిర్ణయం పార్టీకే వదిలేస్తున్నానని ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడినట్లు ఫేక్ సమాచారం ప్రచారమైంది. ఊహాగానాలు చర్చనీయాంశంగా మారడంతో సురేశ్ గోపి స్పందించారు. రాజీనామా చేసే ఉద్దేశం లేదన్నారు. మీడియాలో ఫేక్ ప్రచారం సాగుతోందని కొట్టిపారేశారు. ఇక త్రిసూర్ నుంచి సురేష్ గోపి 74 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : ఎంతో గొప్ప గొప్ప వాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే
తాజావార్తలు
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!