NTV Telugu Site icon

Suresh Gopi: కేంద్ర మంత్రి పదవికి రాజీనామాపై క్లారిటీ!

Suresh

Suresh

సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి గెలిచిన ఒకే ఒక్కడైన బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపికి అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేరళలో త్రిసూర్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన మొదటి బీజేపీ ఎంపీ సురేషే. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై విజయం సాధించారు. అయితే ఆయన ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కొన్ని గంటలైనా గడవక ముందే సురేష్ గోపి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. తన రాజీనామాపై తప్పుడు కథనాలు ప్రచురిస్తు్న్నాయని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో పని చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మోడీ కేబినెట్‌లో ఉండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా కేరళ అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Actor Arrested: నాలుగేళ్ల బాలిక రేప్ .. పోక్సో యాక్ట్ కింద ‘దృశ్యం’ నటుడు అరెస్ట్?

ఆదివారం  మోడీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్‌ హోదా దక్కింది. ప్రధానితో సహా కేబినెట్ మంత్రిగా సురేశ్‌ గోపి ఆదివారం ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని.. ఎంపీగా కొనసాగడమే ఇష్టమని ఆయన తెలిపినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. తన అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని.. తుది నిర్ణయం పార్టీకే వదిలేస్తున్నానని ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడినట్లు ఫేక్‌ సమాచారం ప్రచారమైంది. ఊహాగానాలు చర్చనీయాంశంగా మారడంతో సురేశ్‌ గోపి స్పందించారు. రాజీనామా చేసే ఉద్దేశం లేదన్నారు. మీడియాలో ఫేక్ ప్రచారం సాగుతోందని కొట్టిపారేశారు.  ఇక త్రిసూర్ నుంచి సురేష్ గోపి 74 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : ఎంతో గొప్ప గొప్ప వాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే