NTV Telugu Site icon

Uttar Pradesh: పెళ్లికి అంతా సిద్ధం.. ఇంతలోనే వధువు తల్లితో లేచిపోయిన వరుడి తండ్రి!

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఈ డిజిటల్ యుగంలో సాధ్యం కానిది ఏదీ ఉండదన్న విషయం కొన్ని పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. పెళ్లికొడుకు తండ్రి.. పెళ్లి కుమార్తె తల్లి ఇద్దరూ మనసు పడి పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే జంటగా పరారైన ఉదంతం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలోని దుండ్వారా ప్రాంతంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందు వరుడి తండ్రి వధువు తల్లితో లేచిపోయారు. ఇద్దరూ కలిసి పారిపోవడంతో ఇరు కుటుంబాల్లో కలకలం రేగింది. వరుడి తండ్రిపై వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ ఉదంతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Madhya Pradesh: ఇంట్లో రావణుడికి గుడి కట్టి పూజలు చేస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు..

కస్‌గంజ్ జిల్లాలోని గంజ్ దుండ్వారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పప్పు ఇంటికి తరచూ వచ్చే షకీల్ కొడుకుతో పప్పు కుమార్తె వివాహం జరగనుంది. పెళ్లి తేదీ దగ్గరపడుతుండగా, షకీల్ పప్పు భార్యతో పారిపోయి ఇరు కుటుంబాలను దిగ్భ్రాంతికి గురి చేశాడు. షకీల్ తన భార్యను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని పప్పు పేర్కొన్నాడు. తన భార్యను కిడ్నాప్ చేశాడని షకీల్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నివేదికల ప్రకారం, షకీల్‌కు 10 మంది పిల్లలు, వధువు తల్లికి 6 మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. పప్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుడి తండ్రి షకీల్, వధువు తల్లి మధ్య ప్రేమ వ్యవహారమేంటని ఆ ప్రాంతంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read Also: Snake Man: 172 సార్లు విషసర్పాల కాటుకు గురయ్యాడు.. అయినా వందేళ్లు బతికాడు

తన భార్య అదృశ్యంపై పప్పు మాట్లాడుతూ.. షకీల్ ఆమెను కిడ్నాప్ చేశాడని చెప్పాడు. తన కుమార్తె షకీల్ కుమారుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని.. దీని కోసం షకీల్‌ తరచుగా తమ ఇంటికి వచ్చేవాడని పప్పు వెల్లడించారు. పెళ్లి పనుల కోసమని వచ్చి, తన భార్యతో మాట్లాడేవాడని చెప్పాడు. ఈ సందర్శనల సమయంలో షకీల్ తన భార్యను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని చెప్పాడు. తన భార్య గురించి ఇప్పటివరకు ఎలాంటి వార్తలు రాలేదని పప్పు పేర్కొన్నాడు.

దీనిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏం చెప్పారు?
దుంద్వారాలో ఓ కేసు నమోదైందని సీఓ విజయ్ కుమార్ రాణా తెలిపారు. జూన్ 8న, పప్పు తన భార్య తప్పిపోయిందని పోలీసులకు సమాచారం అందించాడు. గణేష్‌పూర్‌కు చెందిన షకీల్‌ తన భార్యను కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ జూలై 11న పప్పు మరో దరఖాస్తును సమర్పించాడు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.