Site icon NTV Telugu

Wedding Video Going Viral: స్టేజ్‌పై వధువును బలవంతం చేసిన వరుడు..

Wedding Video Going Viral

Wedding Video Going Viral

కొన్ని పెళ్లి వేడుకల్లో చిన్న ఘటనలే రచ్చగా మారతాయి.. అవి రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే వరకు వెళ్లిపోతుంటాయి.. ఫుడ్‌ విషయంలో కొన్నిసార్లు, ఏర్పాట్ల విషయంలో మరికొన్ని సార్లు, వధువు-వరుల మధ్య చోటు చేసుకునే చిన్న మనస్పర్థలు ఇంకొన్నిసార్లు.. మొత్తం పెళ్లి మూడ్‌నే చెడగొట్టేస్తుంటాయి.. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.. స్టేజ్‌పై వరుడు బలవతం చేస్తే.. ప్రతిఘటించిన వధువు.. ఆ తర్వాత వరుడుపై తిరగడింది.. స్టేజ్‌పైనే పెళ్లిబట్టలు ఊడిపోయే దాక కొట్టుకున్నారు..

Read Also: Viral video: ఖాళీ పాత్రలనే ఇలా వాయిస్తున్నాడు.. ఈ బుడతడికి డ్రమ్స్‌ దొరికితే ఏమైనా ఉందా..?

సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోన్న పెళ్లిలో వధువు-వరుడి ఫైటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలో వరుడు.. వధువుకు స్వీట్ ముక్కను తినిపించేందుకు యత్నించాడు.. అయితే, ఆమె వద్దని నిరాకరించింది. కానీ, మనోడి మొండితనమో.. ప్రేమో తెలియదు కానీ.. ఆమెను బలవంతం చేశాడు.. దీంతో, ఆగ్రహానికి గురైన ఆ పెళ్లికూతురు.. బంధువులు, స్నేహితుల సమక్షంలోనే స్టేజీపై వరుడి చెంపను చెల్లుమనిపించింది.. ఆ తర్వాత వరుడు కూడా వధువు చెంపలు వాయించాడు.. ఇక, చిలికి చిలికి గాలివానలా మారిపోయింది పరిస్థితి.. స్టేజ్‌పైనే కొట్టుకున్నారు, గిచ్చుకున్నారు, గిల్లుకున్నారు.. ఇద్దరూ ఒకరి జట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు… పెళ్లి కోసం ముస్తాబు చేయడం కామనే.. ఈ ఇద్దరి ఫైటింగ్‌లో.. పెళ్లికి చేసిన ముస్తాబు చెదిరిపోయింది.. స్టేజ్‌ గందరగోళంగా మారిపోయింది.. బట్టలు ఊడిపోయేదాకా కొట్టుకున్నారు.. ఇక, స్టేజ్‌పై జరుగుతోన్న ఈ ఘటనను చూసిన బంధువులు, స్నేహితులు.. వెంటనే స్టేజీపైకి పరుగెత్తారు… వారిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.. విషయం ఏంటంటే.. అసలే కోపంతో ఉన్న వధూవరులు.. ఆపేందుకు యత్నించినవారిపై కూడా దాడి చేశారు.. ఈ ఘటన సోషల్‌ మీడియకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది..

Exit mobile version