NTV Telugu Site icon

GRMB : గోదావరి రివర్ మేనేజ్ బోర్డ్ చైర్మన్ అధ్యక్షతన 26న భేటీ

Grmb

Grmb

పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆధునీకరణపై రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి రివర్ మేనేజ్ బోర్డ్ చైర్మన్ అధ్యక్షతన 26న భేటీ కానున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖానుండి ఉభయ రాష్ట్రాల ఈఎన్సీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్ లోని జీఆర్ఎంబీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. పెండింగ్ లో ఆధునీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆధునీకరణపై రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖా నిర్ణయం తీసుకుంది.

UP: రూ.20, చాక్లెట్లతో ప్రలోభ.. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 26న హైదరాబాద్ లోని గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ శాఖాధికారులు ఉభయ రాష్ట్రాల ఇ.యన్.సి లకు సమాచారం అందించారు. జీ. ఆర్.యం.బి చైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల నుండి పాల్గొనేందుకు గాను సి.ఇ లేదా యస్.ఇ లను నియమించాలని ఇ. యన్.సి లకు ఆ శాఖా సూచించింది. పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆధునీకరణ అంశం సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నందున ముందుకు తీసుక పోయే విధంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖాధికారులు రాష్ట్ర ఇ.యన్.సి లకు పంపిన సమాచారంలో స్పష్టం చేశారు.

Health Tips: వయసు పెరిగే కొద్ది ఈ వ్యాధులు రావొచ్చు..కొన్ని నియమాలు పాటించండి