Site icon NTV Telugu

ఎన్టీవీకి రాజకీయ నాయకుల శుభాకాంక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ తెలుగు న్యూస్‌ ఛానల్‌ కు మంచి.. క్రేజ్‌ ఉంది. ఏ ఛానల్‌ కు లేని ఆదరణ ఉంది. ప్రతి నిత్యం ప్రజల పక్షం అనే నినాదం ప్రజల గుండె చప్పుడై ఎన్టీవీ తెలుగు న్యూస్‌ ఛానల్‌… ముందుకు సాగుతోంది. 2007 సంవత్సరం లో ప్రారంభమైన ఎన్టీవీ ఛానల్‌.. నేటితో 14 వసంతాలు పూర్తి చేసుకుని… 15 వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యం లో రాజకీయ ప్రముఖులు, సినీతారలు, ప్రేక్షకులు, ఇతరులు అందరూ ఎన్టీవీ ఛానల్‌ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు కూడా ఎన్టీవీకి విషెష్‌ చెప్పారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బత్తి విక్రమార్క, బొత్స, జివిఎల్, తమ్మినేని, వైవి సుబ్బారెడ్డి ఎన్టీవీ ఛానల్‌ కు శుభాకాంక్షలు చెప్పారు.

Exit mobile version