MP Joginapally Santosh Kumar : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ భావితరాలకు స్ఫూర్తిదాయకం : ఆక్టివిస్ట్ డా.సతీష్ శిఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Joginapally Santosh Kumar : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని గ్లోబల్వార్మింగ్యాక్టివిస్ట్డాక్టర్సతీష్శిఖ బీఆర్ఎస్ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ను అభినందించారు. సతీష్ శిఖ ఈ రోజు ప్రగతి భవన్ లో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అధినేత సంతోష్ కుమార్‌ను కలిశారు. డాక్టర్ సతీష్ శిఖ ఓ ఫ్యాషన్ డిజైనర్. 2007లో తన వృత్తిని వదిలి గ్లోబల్ వార్మింగ్ ఆక్టివిస్ట్ గా మారారు. భారత్ లో పుట్టిన కెనాడా ఎన్నారై అయిన డాక్టర్ సతీష్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిగాను మంగోలియా దేశంలోని ఎకో ఏషియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత దేశమంతటా నిరుపేద పిల్లలకు మద్ధతు ఇవ్వడానికి ‘90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించాడు. ఇతను 2007 లో ఒక కిలోమీటర్ పొడవునా ‘ఎకో గ్రీన్ హ్యాండ్ మేడ్ సిల్క్ క్లాత్ ఫ్యాబ్రిక్’ ని నిర్మించారు. ఈ సిల్క్ క్లాత్ పై పర్యావరణానికి మద్దతుగా అనేక మందికి సందేశాలను అందించారు. 72 దేశాల నుండి సుమారు 1,263 మంది ప్రముఖులు, పర్యావరణ కార్యకర్తల సందేశాలతో సిల్క్ క్లాత్ 1.2 కి.మీ. కంటే ఎక్కువ పొడవుగా మారింది.
Read Also: Building Collapsed : కూకట్ పల్లి బిల్డింగ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ద్వారా పర్యావరణానికి చేస్తున్న విశేష కృషిని గుర్తించి సిల్క్ ఫ్యాబ్రిక్ పై తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా డాక్టర్ సతీష్ శిఖ అభ్యర్థించారు. పర్యావరణ పరిరక్షణకు తగిన చొరవ చూపుతున్న డాక్టర్ సతీష్ శిఖ కార్యక్రమానికి ముగ్ధుడైన సంతోష్ కుమార్ అతని అభ్యర్థనను గౌరవిస్తూ.. ‘‘మొక్కలను నాటండి, రక్షించండి, ప్రోత్సహించండి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దేశాన్ని తద్వారా భూగోళాన్ని రక్షించండి’’ అంటూ సిల్క్ ఫ్యాబ్రిక్ (పట్టు వస్త్రం)పై తన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ రాగి నాణేన్ని ఎంపీ సంతోష్ కుమార్ కు బహుమతిగా ఇచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను డాక్టర్ సతీష్ శిఖ ప్రశంసిస్తూ వాటిని నిరంతరంగా కొనసాగించాలని ఎంపీని అభ్యర్థించారు.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!