NTV Telugu Site icon

Cardamom : యాలకులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

New Project (4)

New Project (4)

Cardamom : యాలకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని పోషకాల భాండాగారం అంటారు. పచ్చి యాలకులు తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సుగంధ ద్రవ్యాల పంటగా పరిగణించే యాలకులు వేస్తే కూరలు గుమగుమలాడుతాయి. పోషకాలు, ఫైబర్ కంటెంట్ కూడా ఈ గింజలలో ఎక్కువగా ఉంటుంది. వీటిని తరుచూ తినడం వల్ల అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

పచ్చి ఏలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పచ్చి యాలకులు తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాల లోపం తొలగిపోతుంది. ఎందుకంటే ఏలకులు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, పొటాషియం మొదలైన అనేక మూలకాలను కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో సాధారణ సమస్యలలో ఊబకాయం ఒకటి. అందరూ కడుపు నిండా తిని… అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ రోజువారీ జీవనశైలిని మార్చుకోమంటే మాత్రం అంగీకరించరు. ఆఫీసులో కూర్చుని పనిచేసేవారికి.. ప్రధానంగా పొట్టలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు కూర్చుని పని చేయడమే. మనం తినే ఆహారం, శరీరంలో కొవ్వు పెరిగేకొద్దీ సమస్యలు తీవ్రమవుతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు తినడం వల్ల కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
పచ్చి యాలకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి, కాబట్టి పచ్చి ఏలకులను రోజూ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే యాలకులలోని పొటాషియం, ఫైబర్ కంటెంట్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. యాలకులు రోజూ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ఆకుపచ్చ యాలకుల వినియోగం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు, మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, ప్రతిరోజూ పచ్చి యాలకులను తినవచ్చు.

Show comments