డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అత్తని హత్య చేయాలని ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్‌లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్ పెట్టాడు. పైగా ఆమె హత్యను హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ట్రై చేశాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందు వెంకటేష్ వేసిన స్కెచ్ వెలవెలబోయింది. దీంతో పోలీసులకు పట్టుబడ్డాడు..
READ MORE: Pawan Kalyan: తీసుకునే లోకంలో ఇవ్వాలనుకున్న విహాన్ గొప్పవాడు
ఈనెల 7న సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రామమ్మ అనే మహిళ మృతి చెందింది. రామమ్మ అల్లుడు తాళ్ల వెంకటేష్ 100కి డయల్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో మహేంద్ర థార్ వాహనం కనిపించింది. అయితే ఆ వాహనమే మహిళని ఢీకొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. TS 18 G 2277 నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు తొగుట పోలీసులు. ఆ వాహనాన్ని సిద్దిపేటలో వెంకటేష్‌కి సోదరుడి వరుస అయిన కరుణాకర్ తీసుకున్నట్టు తేలింది. దీంతో పోలీసులకు రామమ్మ అల్లుడుపై అనుమానం కలిగింది. వెంకటేష్‌ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు తొగుట పోలీసులు..
READ MORE: JioPC: ఇది కదా కావాల్సింది.. జియోపీసీని ప్రారంభించిన జియో.. ఇకపై టీవీనే కంప్యూటర్‌గా..
వెంకటేష్‌ని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. అత్త రామమ్మని తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వెంకటేష్ పౌల్ట్రీ ఫారం బిజినెస్, వ్యవసాయం చేసి 22 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. అలాగే సోదరుడు కరుణాకర్‌కి అప్పుగా లక్షా 30 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు.. వ్యాపారంలో వచ్చిన నష్టం నుంచి బయట పడాలనుకున్నాడు వెంకటేష్. వికలాంగురాలైన తన అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు. అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు SBI లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు. అలాగే ఆమె చనిపోతే మరో 5 లక్షల రూపాయలు రైతు బీమా వస్తాయని తన పేరుపై ఉన్న భూమిని కూడా అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు అల్లుడు వెంకటేష్. ఓ రోజు తన సోదరుడు కరుణాకర్‌ని పిలిచి తనకి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వాలని అడగ్గా… కొద్దిగా సమయం కావాలని కోరాడు కరుణాకర్. వెంకటేష్.. కరుణాకర్‌కి ఓ ఆఫర్ ఇచ్చాడు అత్తని హత్య చేస్తే తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అలాగే అత్త ఇన్సూరెన్స్ డబ్బులలో ఇద్దరం చేరి సగం పంచుకుందామని చెప్పడంతో కరుణాకర్ ఒకే చెప్పాడు. వెంటనే హత్యకు ప్లాన్ చేశారు…
READ MORE: Radhika Yadav: రాధిక యాదవ్ హత్య కేసు.. నిందితుడి గురించి సంచలన విషయాలు..
ఈ నెల 7న అల్లుడు వెంకటేష్.. విద్యుత్ అధికారులు బావి వద్దకు వస్తున్నారని చెప్పి.. అత్త రామమ్మను వెంటపెట్టుకుని పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమెను మాసాన్‌పల్లి వద్ద రోడ్డుపైనే నిలబెట్టాడు. ఇంతలో కరుణాకర్ థార్ కారులో వచ్చి వేగంగా రామమ్మను ఢీకొట్టి వెళ్లిపోయాడు. కాసేపటి ఏమీ తెలియనట్లు వచ్చిన వెంకటేష్.. 100కి కాల్ చేసి హిట్ అండ్ రన్ అని చెప్పాడు. కానీ చివరికి పోలీసుల విచారణలో అల్లుడి బాగోతం బయటపడింది. దృశ్యం -2 సినిమా చూసి వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.. అల్లుడి తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. కానీ అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామన్న అల్లుడి ప్లాన్ బెడిసికొట్టింది.
