NTV Telugu Site icon

Kurnool Crime: కర్నూలులో దారుణం.. నాన్నమ్మను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మనవడు..

Crime

Crime

Kurnool Crime: కర్నూలు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది.. నాన్నమ్మనే దారుణంగా హత్య చేసిన మనవడు.. ఇంట్లోనే ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు.. జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గొనెగండ్ల మండలం పెద్దమరివీడులో వెంకటేష్‌ అనే వ్యక్తి.. నాగమ్మ అనే తన నాన్నమ్మను గొంతు నులిమి చంపాడు.. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా.. ఆ ఇంట్లోనే పాతిపెట్టాడు మనవడు వెంకటేష్.. నాగమ్మ దగ్గర ఉన్న డబ్బుల కోసమే వెంకటేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.. ఇక, నాగమ్మను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన వెంకటేష్.. తనకు ఏమీ తెలియనట్టుగా.. ఇంటినుంచి పారిపోయాడు.. ఎంతకీ నాగమ్మ ఆచూకీ లభించకపోవడంతో.. బంధువులు వెంకటేష్‌ని నిలదీశారు.. చివరకు తానే హత్య చేసినట్టు వెంకటేష్ ఒప్పుకున్నాడు.. దీంతో.. కిడ్నాప్, మిస్సింగ్‌ కేసును కాస్తా హత్య కేసుగా మార్చారు పోలీసులు.. ఈ రోజు నాగమ్మ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించనున్నారు పోలీసులు..

Read Also: Steven Smith-IPL 2024: ఐపీఎల్ 2024లోకి ‘అన్‌సోల్డ్‌’ స్టీవ్ స్మిత్.. అంబటి రాయుడు కూడా!

అయితే, నాగమ్మ కొడుకు, కోడలు బతుకుదెరువు కోసం వేరే ఊరికి వలస వెళ్లిపోవడంతో.. ఇంటి దగ్గర నాగమ్మ మనవడితో కలిసి ఉంటోంది. అయితే, చెడు అలవాట్లకు బానిసైన వెంకటేష్‌.. తరచూ డబ్బుల కోసం నాగమ్మను వేధించేవాడని తెలుస్తోంది.. అంతేకాదు.. ఈ సారి నాగమ్మ వద్ద ఉన్న బంగారంపై కన్నేసిన అతను.. ఎలాగైనా తన వద్దనున్న బంగారాన్ని కాజేయాలని ప్లాన్ చేసి.. అందులో భాగంగానే నాన్నమ్మను దారుణంగా హత్య చేశాడు. మార్చి5 వ తేదీన చంపేసి బంగారం కాజేశాడు.. ఆ తర్వాత ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టి.. ఏమీ ఎరగనట్లు వెళ్లిపోయాడు.. ఇక, 13వ తేదీ ఇంటికి వచ్చిన నాగమ్మ కుమారుడు.. ఇంట్లో తల్లి కనపడక పోవటంతో ఆందోళనకు గురయ్యాడు.. తెలిసినవారి దగ్గర వాకాబు చేశాడు.. చివరకు గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. ఇదే సమయంలో మనవడు వెంకటేష్ ప్రవర్తనపై అనుమానం వచ్చి.. అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో.. అసలు విషయం వెలుగుచూసింది.. నాన్నమ్మను తానే చంపి.. ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టు వెంకటేష్ అంగీకరించాడు. దీంతో వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Show comments