NTV Telugu Site icon

Rape : నెలల పాపపై అత్యాచారం.. కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

Rape

Rape

విజయనగరం జిల్లాలో నెలల పాపపై తాతయ్య అత్యాచారం కలకలం రేపింది. ఘోర ఘటనపై ప్రతి స్పందిస్తూ ఆ కామాధుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని అరెస్టు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలస గ్రామంలో ఏడు నెలల పసికందు పై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రి కి బాడంగి సిహెచ్సీకి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. ప్రాధమిక చికిత్స అందించి వైద్యులు విజయనగరంలోని ఘోషాసుపత్రికి తరలించారు. పైడిరాజులకు జనవరి నెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పసికందుకు 7 నెలలు. గ్రామానికి నిత్యవసర అమ్మడానికి వ్యాపారులు రావడం జరిగింది. పైడ్రాజు నిత్యవసర సరుకులు కొనడానికి వెళ్లింది. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న నేరెళ్ల వలస గ్రామానికి చెందిన ఎరకయ్య చుట్టరకానికి వచ్చాడు. నిద్రిస్తున్న పసికందు పై అత్యాచారం చేస్తుండగా పసికందు అక్క చూసి తల్లి పైడ్రాజుకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిగా ఉయ్యాల దగ్గరికి తల్లి వచ్చి చూసేసరికి రక్తస్రావం కావడంతో పసికందును తీసుకొని రామభద్రపురం ఆసుపత్రి వచ్చారు తల్లిదండ్రులు. ప్రాధమిక చికిత్స చేసిన తరువాత విజయనగతంలోని ఘోషాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది.

విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనువాస్ తో పాటు విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఘటన అమానుషమని.. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు హేయమన్నారు మంత్రి కొండపల్లి. నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పాప కండిషన్ నిలకడగా ఉందని.. డాక్టర్ ల పర్యవేక్షణలో పాప కి వైద్యం అందుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి తల్లి కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఇలాంటి ఘటనల పై జరగకుండా నిర్ణయాలు ఉంటాయి.

వాయిస్: జిలిక వలస ఆరు నెలల పసికందు అత్యాచారంపై స్పందించిన మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సాధ్యారాణి‌ స్పందించారు.ఇది దారుణమని.. సభ్య సమాజం తలదించుకునే రోజని అన్నారు. మానవ మృగం చేసిన పని అత్యంత హేయమైన ఆటవిక చర్యని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇలాంటి వారికి ఉరిశిక్ష సరైనదని భావిస్తున్నానని అన్నారు. ఇలాంటి పనులు చేసిన వారికి నడి రోడ్డుపై ఉరితియ్యాలి. ఇలాంటి వారికి బెయిల్ రాకుండా కఠినమైన శిక్షలు పడాలన్నారు. ఇదిలా ఉండాగా, అత్యాచారానికి పాల్పడ్డ ఎరకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నేరాన్ని అంగీకరించడం తో ఎరకయ్యను అరెస్టు చేసారు.

Show comments