Grand Mother Sold Her Grand Son in Khammam District: తమకు పుట్టిన పిల్లల కన్నా వాళ్లకు పుట్టిన పిల్లలనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు నాయనమ్మలు, అమ్మమ్మలు. మనవళ్లు, మనవరాళ్లను అల్లారు ముద్దుగా, గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో చోటుచేసుకుంది. తన సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తతపేరుతో నాయనమ్మ హైడ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహాయంతో హైదారాబాద్ వాసికి మనవడిని అమ్మేసింది. ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు సాయి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకు చనిపోయాడని కోడలి వద్ద నుంచి మనవడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. నా మనవడిని నువ్వు సాకలేవంటూ నాయనమ్మ పందుల నాగమణి దత్తత తీసుకుంది. దత్తత తరువాత 5లక్షలకు అమ్మేసిందంటూ కోడలు స్వప్న పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Minister Nara Lokesh: టీడీపీ నేత దారుణ హత్య.. ఖండించిన మంత్రి నారా లోకేష్..
రఘునాథ పాలెంకి చెందిన పందుల సాయి, ఖమ్మం నగరంలో నిజాం పేటకు చెందిన కొమ్మినబోయిన స్వప్న 2021 డిసెంబరు లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2023లో బాబు పుట్టాడు.బాబు పుట్టిన నెల రోజులకే 2023లో పందుల సాయి ప్రమాదంలో మృతి చెందాడు. సాయి మృతి అనంతరం కార్పొరేటర్ సహకారంతో అత్త పందుల నాగమణి తన కోడలి వద్ద నుండి బాబును పెంచుకుంటానని తీసుకెళ్లింది. 45 రోజులకే బాబును దత్తత ఇస్తున్నాను అంటూ బాబును అమ్మకానికి పెట్టింది. అయితే బాబు కోసం స్వప్న ఎంతగానో తపించింది. తన బాబును తనకు ఇవ్వమని కార్పొరేటర్ భర్త చుట్టూ తిరిగింది. అయినా పట్టించుకోలేదని స్వప్న ఆవేదన వ్యక్తం చేసింది. బాబును ఇవ్వనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న కార్పొరేటర్ భర్త వద్ద కన్నీరు పెట్టుకుంది ఆ తల్లి. చివరకు తన బాబును తనకు ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.