ఉమ్మడి నిజామాబాద్‌లో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు పడిగాపులు పడుతున్నారు. కోత పూర్తి చేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన తర్వాత వారికి అసలు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో నిబంధనలకు అనుగు ణంగా 17శాతంలోపు ఉంటే తప్ప కాంటా వేయడం లేదు. ఒక వేళ తేమ శాతం వచ్చినా తమ తమ వంతు వచ్చే వరకు ఎదురు చూడక తప్పడం లేదు. ఈ రెండు దాటుకుని ముందుకు వస్తే అప్పటికే కాంటాబస్తాలతో లారీలు నిండిపోయి ఉంటున్నాయి. మరోవైపు మిల్లర్లు నూక పేరుతో ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ధాన్యం బాగా ఎండితే పూర్తిగా నూక అవుతుందంటున్నారు. దీంతో ధాన్యం మిల్లులో దించుకోలేక తిరిగి తెచ్చుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మిల్లర్లు ఏ సాకూ చెప్పకుండా దించుకోవాలంటే నాలుగు నుంచిఐదు కిలోల వరకు తరుగు ఇస్తామని ఒప్పుకోవాలి. కోతలు ప్రారంభమై నప్పటి నుంచి రైతులు ధాన్యం కేంద్రాలకు ధాన్యం తీసుకోస్తున్నారు. ప్రభుత్వం కేంద్రాలకు సమయానికి తెరవకపోవడం కూడా ఈ సమస్య కు కారణమైంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకు పో యింద. మిల్లర్లు ధాన్యం దించుకోవడానికి ఇష్టపడక పోవడంతో ధాన్యం లారీల్లోనే మగ్గుతుంది. ఒక వేళ కొనుగోలు కేంద్రాల్లో కాంటా పూర్త యినా మిల్లులకు తరలించేందుకు లారీలు లేకపో వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి ఇబ్బందులను తొలగించాలని రైతులు కోరుతున్నారు.
