NTV Telugu Site icon

Gowru Charitha Reddy: పాణ్యం ప్రజలను ఆకట్టుకుంటున్న గౌరు చరిత రెడ్డి మేనిఫెస్టో..

Gowri

Gowri

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గంలో టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. అయితే, ఈసారి గెలుపు తమదే అని టీడీపీ నేతలు అంటున్నారు. తమ అభ్యర్థి గౌరు చరిత రెడ్డికి ఎన్నికల ముందు దక్కుతున్న ప్రజాదరణ చూస్తుంటే గెలును తథ్యమనిపిస్తోందని చెప్పుకొస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గౌరు చరితరెడ్డి పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. ఇది తమ గెలుపుకు తోడ్పతుందని పేర్కొంటున్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ సిక్స్ పథకాలు, డోర్ టు డోర్ ప్రచారం, ప్రజాగళం అంటూ ఎన్నికల ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నారు. అలాగే, 2014- 19 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేసిన అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో గౌరు చరితరెడ్డి విజయవంతం అయ్యారని పాణ్యం టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Read Also: Mallikarjun Kharge: కొన్ని హామీలు అమలు చేయలేక పోయాం.. కారణం చెప్పిన ఖర్గే

ఇక, గౌరు చరితరెడ్డి నిత్యం ప్రజల సమస్యల కోసం ప్రశ్నించే తత్వం తమకు ప్లస్ అవుతుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ.. గౌరు చరిత రెడ్డి ప్రజలను ఓటు అభ్యర్థిస్తూ.. పాణ్యం నియోజకవర్గ ఓటర్లకు ఓ హామీ పత్రాన్ని విడుదల చేశారు. తనకు ఈసారి అవకాశం ఇస్తే.. ఓర్వకల్లు కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే, హంద్రీనీవా కాల్వ నుంచి ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకం చేపట్టి ఓర్వకల్లు మండల ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామని.. అలగనూరు, గోరకల్లు రిజర్వాయర్ల మరమ్మత్తులు పూర్తి చేస్తామన్నారు. పాణ్యం పరిధిలోకి వచ్చే కర్నూలు నగర పాలక సంస్థలోని 16 వార్డులకు నిత్యం తాగునీరు అందించేలా వాటర్ ట్యాంక్ నిర్మాణం, ఉర్దూ యూనివర్సిటీలో పెండింగ్ పనులతో పాటు కొత్తగా షాదీఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించి ఎమ్మెల్యే గెలిపించమంటూ గౌరు చరిత రెడ్డి ప్రజలను కోరుతున్నారు.

Read Also: CSK Playoffs Chances: చెన్నైకి చావోరేవో.. గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం!

కాగా, గతంలో ఎమ్మెల్యేగా గౌరు కుటుంబం చేసిన అభివృద్ధితో పాటు మహిళా నేతగా తనకు ప్రజల్లో క్లీన్ ఇమేజ్ ఉండడంతో ఈ ఎన్నికల్లో పాణ్యం ప్రజలు గౌరు చరిత రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారనేది టీడీపీ అంచనా వేస్తుంది. అలాగే, టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలను క్షేత్రస్థాయిలో కలుపుకుని పోతున్నారు. ఇక, తన భర్త నందికొట్కూరు టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, కుమారుడు గౌరు జనార్థన్ రెడ్డి తదితర కుటుంబ సభ్యుల సహకారంతో గౌరు చరిత రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు.

PM Narendra Modi First Ever Exclusive Interview With NTV Telugu