ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ కోచ్ సమరేష్ జంగ్ శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన రాగానే అతడి ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసులు అందాయి. అర్జున అవార్డు గ్రహీత జంగ్ ఇల్లు ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతం.. ఖైబర్ పాస్ ఏరియాలో ఉంది. ఆయనకే కాకుండా ఆ కాలనీ వాసులందరికీ నోటీసులు అందాయి. హౌసింగ్ మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ సంస్థ అయిన ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (LNDO) నివాసితులకు నోటీసు జారీ చేసింది.
READ MORE: SR Nagar Hostel: ఎస్ ఆర్ నగర్ లో హాస్టల్ లో డ్రగ్స్ కలకలం..
ఖైబర్ పాస్ ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు, ఇతర నిర్మాణాలు అక్రమంగా నిర్మించబడ్డాయని ఎల్డీఎన్ఓ తెలిపింది. మీడియాతో మాట్లాడిన సమరేష్ జంగ్, “దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. వారు మొత్తం కాలనీని అక్రమంగా ప్రకటించారు. కూల్చివేత కార్యక్రమం గురించి ప్రాంత వాసులకు గత రాత్రి సమాచారం అందించారు. ఇప్పుడు వారు మొత్తం కాలనీని ఖాళీ చేయడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. మా కుటుంబం 1950 నుంచి గత 75 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తోంది. మేము కోర్టుకు వెళ్లాము. కానీ పిటిషన్ తిరస్కరించబడింది.” అని వ్యాఖ్యానించారు.
READ MORE:Janhvi Kapoor: జీవితంలో ఆ పని అస్సలు చేయొద్దంది.. జాన్వీ సంచలన వ్యాఖ్యలు
కేవలం రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని జంగ్ తెలిపారు. “కూల్చివేత డ్రైవ్‌ను నిర్వహించాలని అనుకుంటున్నారు.. కానీ ఇది దానికి సరైన పద్ధతిలో నిర్వహించాలి. ప్రజలకు సమయం ఇవ్వాలి. ఒక వ్యక్తి తన ఇంటిని ఒక్క రోజులో ఎలా ఖాళీ చేస్తాడు?’ అని సమరేష్ జంగ్ ప్రశ్నించారు. కాగా.. ఆయన 2006లో మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.