బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల రక్షణ గాలికి వదిలేసి ప్రలోబాలకు గురిచేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి భద్రతను తొలగించడం అప్రజాస్వామ్యకమైన చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టీపీసీసీ చీఫ్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగానే భద్రతను తొలగించిందని సీతక్క ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భద్రత చర్యలను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి రాజకీయాల కోసం ప్రలోభాలకు పాల్పడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.
Read Also: LiFi: ఎల్ఈడీ బల్బ్‌తో ఇంటర్నెట్… ఇక హ్యాకింగ్ బెడద తప్పినట్టే
అయితే, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీకి ప్రభుత్వం భద్రతా సిబ్బందిని నిన్న ( గురువారం ) తొలగించింది. దీంతో ఒక ఎంపీ క్యాండిడెట్ కి భద్రతను తొలగించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తికి తగిన రక్షణ కల్పించాల్సిన భద్రత ప్రభుత్వానిదే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వెంటనే సదరు ఎంపీకి భద్రత ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం పట్టించుకోలేదు.
Read Also: Manchu Vishnu : జిన్నా తర్వాత ‘కన్నప్ప’ అంటున్న మంచు విష్ణు..
ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహబూబ్ నగర్ పోలీసులపై హాట్ కామెంట్స్ చేయడం వల్లే ప్రభుత్వం సదరు ఎంపీకి భద్రతను తొలగించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు భద్రత సిబ్బందిని తొలగించింది అనే విషయాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో సర్కార్ పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.