Manchu Vishnu : జిన్నా తర్వాత ‘కన్నప్ప’ అంటున్న మంచు విష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు కు ఈ మధ్య హిట్ సినిమాలు లేవనే చెప్పాలి.. ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు.. గత సంవత్సరం జిన్నా సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు విష్ణు. ఇక తన సినిమాల కంటే కూడా తన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళానున్నాడు..కన్నప్ప అని గతంలోనే ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో భక్త కన్నప్ప సినిమా గురించి మాట్లాడారు కూడా..
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్ర ని ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు, ఈరోజు ‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీ కాళహస్తి లో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారు.అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు మంచు. తన తండ్రి లెజెండరీ నటుడు, నిర్మాత శ్రీ మోహన్ బాబు గారు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
స్టార్ ప్లస్ లో మహాభారత సిరీస్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు . కృతి సనాన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన హీరోయిన్ గా నటిస్తారు. అలాగే లెజెండరీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ , బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథ కి కీలక మెలికలు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమా భక్త కన్నప్ప. అతని భక్తి యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం అని విష్ణు అన్నారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్ లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేయనున్నట్లు చిత్రాయూనిట్ తెలిపారు.. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తామని విష్ణు మంచు తెలిపారు..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!