Harish Rao: తెలంగాణలో ప్రాథమిక వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో మానిటరింగ్ హబ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 887 పీహెచ్‌సీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశామన్నారు. మెరుగైన పర్యవేక్షణ కోసం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీఎస్‌ఎమ్‌ఐడీసీలను విలీనం చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో ఎక్కడి నుంచైనా ఉన్నతాధికారులు పనులను పర్యవేక్షించవచ్చని తెలిపారు ల్యాబ్‌ను, ఫార్మసీని అధికారులు ఎప్పుడైనా పర్యవేక్షించవచ్చు.
Read Also: World Pneumonia Day : దగ్గును దగ్గరకు రానీయకండి.. న్యుమోనియాను నిర్లక్ష్యం చేయకండి
సీసీటీవీల వల్ల అదనపు భద్రత ఉంటుందని, ఈ తరహా పర్యవేక్షణ కౌంట్‌లో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. డాక్టర్లు ఆయా పీహెచ్‌సీలోని ఫార్మసీ, ల్యాబ్‌ను మాటనిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలకు రూ.67 కోట్లతో 43 కొత్త భవనాలు నిర్మించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. 372 పీహెచ్‌సీల్లో మరమ్మతుల కోసం రూ.43.18 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 1239 సబ్ సెంటర్లు మంజూరు చేశామని, ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు.
Read Also: Bandi Sanjay Hot Comments: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సీఎం, హోంమంత్రులను సాక్షిగా చేర్చాల్సిందే
డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. మునుగోడు ఉప ఎన్నిక వల్లే డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యమైందన్నారు. వారం రోజుల్లో 969 పీహెచ్ సీ డాక్టర్ల సర్టిఫికేట్లు తనిఖీ చేసి తొందర్లోనే నియామక పత్రాలు అందజేస్తామన్నారు. 4500 పల్లె దవాఖానలో 2900 ఏఎన్ఎమ్ సబ్ సెంటర్లుగా మార్చుతున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. 3800 గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. 1569 పల్లె దవాఖానాల్లో పోస్టుల భర్తీ ఎన్నిక వల్ల ఆలస్యం అయ్యిందన్నారు మంత్రి హరీశ్ రావు. బస్తీ దవాఖానలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించిందని హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాలను ప్రారంభిస్తామన్నారు.
