Site icon NTV Telugu

Uttarpradesh: ప్రభుత్వం జొమాటో సేవలేమీ నడపట్లేదు.. కలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Collector

Collector

Uttarpradesh: ఉత్తరప్రదేశ్ వరదలతో అల్లాడుతున్న తరుణంలో అంబేడ్కర్ నగర్ జిల్లా కలెక్టర్‌ స్థానిక ప్రజలతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇంటింటికీ సేవ లేదా సహాయక సామగ్రిని అందించడానికి ప్రభుత్వం జొమాటో సేవలను నడపట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. వర్షాల కారణంగా నది పొంగి పొర్లడం అంబేడ్కర్‌ నగర్‌ జిల్లా వరదల కారణంగా తీవ్ర ఇక్కట్లు పటుతున్నారు. ఘఘరా నదికి వచ్చిన వరదల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సహాయక శిబరాలను ఏర్పాటు చేయగా.. కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిస్తున్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌.. బాధితులు సహాయక శిబరాలకు తరలివెళ్లాల్సిందిగా కోరారు. సహాయ శిబిరాల్లో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. “.మీకు అవసరమైతే క్లోరిన్ మాత్రలు అందజేస్తాం. ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు చూడటానికి ఒక వైద్యుడు వస్తారు. ఈ ఉద్దేశంతోనే సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మీరు ఇంట్లో ఉంటే మేం ఆహారం పంపాలా?.. ప్రభుత్వం జొమాటో సేవలను అమలు చేయడం లేదు” అని కలెక్టర్‌ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బాధితులు సహాయక సామగ్రిని సేకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ మాటలను నెటిజన్లు తప్పుపడుతున్నారు. కాస్త సున్నితంగా ఉండాలని సూచిస్తున్నారు.

Physical Harassment : విద్యార్థినిపై వికృత చేష్టలు.. బయటపడ్డ ప్రిన్సిపాల్‌ కీచకపర్వం..

సోమవారం నుంచి రాష్ట్రంలోని 18 జిల్లాల వరదల బారిన పడ్డాయి. చంద్రదీప్ ఘాట్ వద్ద కువానో నది నీటిమట్టం పెరగడంతో దాదాపు నెల రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబరు 18న యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ వారం ప్రారంభంలో యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, భారీ వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని జిల్లాల్లో సహాయ, పునరావాస పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారుల నేతృత్వంలో జిల్లా కంట్రోల్ రూం 24 గంటలూ పనిచేయాలని సీఎం యోగి ఆదేశించారు. గోండా, బస్తీ, అంబేద్కర్ నగర్, సంత్ కబీర్ నగర్, గోరఖ్‌పూర్, అజంగఢ్, డియోరియా, మౌ, బల్లియా, అయోధ్యలో వరద ముప్పు పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని యోగి అధికారులను ఆదేశించారు.

Exit mobile version