NTV Telugu Site icon

CM Jagan : సీఎం జగన్‌ను కలిసిన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

Venkatrami Reddy

Venkatrami Reddy

సీఎం వైఎస్ జగన్‌ను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కలిశారు. ఆయనతో పాటు సీఎంను సాక్షర భారత్, రెవెన్యూ, సర్వే ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సాక్షర భారత్ కింద పని చేస్తోన్న 500 మంది మండల కో ఆర్డినేటర్లను గత ప్రభుత్వం తొలగించిందని, సాక్షర భారత్ లో 20 వేల మంది గ్రామ కో ఆర్డినేటర్లను గత ప్రభుత్వం తొలగించిందన్నారు. అంతేకాకుండా.. తొలగించిన మండల కో- ఆర్డినేటర్లను స్వచ్చాంధ్ర కార్పోరేషన్ లో ఉద్యోగులుగా సీఎం జగన్ నియమించారని, తొలగించిన 20వేల మంది గ్రామ కో ఆర్డినేటర్లలో 5 వేల మంది ని తిరిగి వాలంటీర్లుగా సీఎం నియమించారన్నారు. ఇంటర్ విద్యార్హత కల్గిన 5 వేల గ్రామ కో ఆర్డినేటర్లను వాలంటీర్లుగా సీఎం నియమించారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం తొలగించిన ఆయుష్ సిబ్బందికి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, వీటికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

Also Read : DK Shiva kumar: శివ శివ.. నీకే ఎందుకిలా.. టైం బాగోలేనట్టుంది

గత ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగాలే 60వేలు తగ్గాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో లక్ష రెగ్యులర్ ఉద్యోగాలు పెరిగాయన్నారు. ఉద్యోగులకు న్యాయం చేస్తోన్న సీఎం జగన్ కు కృతజ్ణతలు తెలిపామని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఎ లకు గతంలో నుంచి ఇస్తోన్న 300 రూపాయల డీఎ రికవరీ చేయాలన్న ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని సీఎంను కోరామని, వీఆర్వో ల పదోన్నతుల్లో ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరామన్నారు. మా విజ్ణప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, వీఆర్ఎల డీఎను తొలగించకుండా పునరుద్దరించాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. కొన్ని సంఘాలు ఉద్యోగులతో కలసి చేస్తోన్న ఆందోళన ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఉద్యోగ సంఘాలు చేస్తోన్న పోరాటం వారికోసం చేస్తున్నది తప్ప ఉద్యోగుల కోసం కాదన్నారు.

Also Read : Terrible Video : పౌరుషం అంటే ఇదీ.. బతికినా చచ్చినా ఇలాగే ఉండాలి..