NTV Telugu Site icon

Delivey on Road: మొన్న సంగారెడ్డిలో… నిన్న జడ్చర్లలో రోడ్డుపై ప్రసవం

delivery

Images

సాధారణంగా ప్రసవాలు ఆస్పత్రుల్లో జరుగుతుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం నడిరోడ్డుమీద ప్రసవించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాసుపత్రి సిబ్బందిలో మార్కులు రావడం లేదు. వారి కర్కశత్వానికి … ఓ నిండు గర్బిణి అర్దరాత్రి చలిలో రోడ్డు పై ప్రసవించిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. అసలే నిండు గర్భిణీ…. దానికి తోడు ప్రసవ నొప్పులు…. కూత వేటు దూరంలో ఆసుపత్రి ఉన్నా చేర్చుకోలేదు సిబ్బంది. దీంతో ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి దాటిన తర్వాత పురిటి నొప్పులు పడుతూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఓ నిండు గర్బిణి . ఇప్పుడీ అమానవీయ ఘటనతో జడ్చర్ల వైద్యుల తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు.

Read Also: Vizag Tragedy:ఎండాడలో విషాదం.. అపార్ట్ మెంట్ నుంచి పడి విద్యార్ది మృతి

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి చెందిన గర్బిణి యాదమ్మ ఇటీవల చికిత్స కోసం జడ్చర్ల ఆసుపత్రికి వచ్చి వైద్యులను కలిసింది . నెలలు నిండలేదని సరియైన సలహాలు సూచనలు ఇవ్వకుండా అక్కడి నుంచి పంపించేసారు వైద్యులు. మద్యానికి బానిసై పట్టించుకోని భర్త , ఆస్పత్రిలో చేరాలనే ఉద్దేశ్యంతో గత రెండు రోజుల నుండి యాదమ్మ జడ్చర్ల పట్టణంలోని తన మూడు సంవత్సరాల కొడుకు చరణ్ తో కలిసి ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోనే తలదాచుకుంటోంది. గాంధీ కూడలిలో ఓ రేకుల షెడ్డు కింద తలదాచుకుంది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత యాదమ్మకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సమీపంలో ఎవరూ లేకపోవడంతో అక్కడే ఎముకలు కొరికే చలిలో ఇబ్బంది పడుతూ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో అటుగా వెళుతున్న ఓ షాపు యజమాని ఆమె దీనస్థితిని చూసి తల్లి బిడ్డలను తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హృదయ విదారకరమైన ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై ఆస్పత్రి సిబ్బంది మాత్రం యాదమ్మ చోరీలకు పాల్పడుతుందని , పోలీసులకు కూడా ఫిర్యాదు చేసామని , అందుకే ఆస్పత్రిలో చేర్చుకోలేదని చెబుతున్నారు. ఏదిఏమైనా అస్పత్రి సిబ్బంది తీరు విమర్శల పాలవుతోంది. రెండురోజుల క్రితం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోనూ ఇలాంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై ఓ మహిళ ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానికులే ఆమెకు పురుడు పోసారు.

Read Also: Hijras Created Havoc: పోలీస్ స్టేషన్ లో హిజ్రాలు వీరంగం .. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం