NTV Telugu Site icon

Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర సర్కార్..

Petrol

Petrol

Central Govt: అధిక పెట్రో ధరల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే, మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 6 నుంచి 10 రూపాయల వరకు తగ్గించాలని మోడీ సర్కార్ భావిస్తోంది.

Read Also: Amit Shah: తెలంగాణపై బిజెపి దృష్టి.. ‘మిషన్ 2024’ కోసం పార్టీకి టార్గెట్ పెట్టిన అమిత్ షా

అయితే, ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోడీ ఆమోదం కోసం పంపించారని సమాచారం. ఇక, ఈ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. చాలా నెలలుగా ప్రభుత్వరంగ రిటైల్ చమురు కంపెనీలు పెట్రో ధరల విషయంలో మార్పు ఉండదని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో రిటైల్ కంపెనీలు ఆ ధరల భారాన్ని ప్రజలపై పడింది.

Read Also: Drunk And Drive: దొరికితే చుక్కలే.. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా ఆ మేరకు రిటైల్ అమ్మకం ధరలను సదరు సంస్థలు తగ్గించలేదు.. దాంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా 58 వేల 198 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయి. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8, లీటర్ డీజిల్ ధర 6 రూపాయల మేర తగ్గింది. కొద్ది నెలలుగా పలు రాష్ట్రల్లో ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచకపోవడంతో పాటు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర సర్కార్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.