NTV Telugu Site icon

Next Army Chief: కొత్త ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేదీ?

New Project (55)

New Project (55)

Next Army Chief: డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. అతను జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియమితులు కానున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదీ నియామకంలో ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ఆయనను నిమమించే అవకాశం ఉంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. ప్రస్తుత డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని తదుపరి ఆర్మీ చీఫ్‌గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 30 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది.

లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూలై 1, 1964న జన్మించారు. లెఫ్టినెంట్ ద్వివేది సైనిక్ స్కూల్ రేవా, నేషనల్ డిఫెన్స్ కాలేజీ, అమెరికా ఆర్మీ వార్ కాలేజీ నుండి పట్టభద్రులయ్యారు. అతను డీఎస్ఎస్సీ వెల్లింగ్టన్, ఆర్మీ వార్ కాలేజీ (Mhow) నుండి కూడా కోర్సులు చేశాడు. అదనంగా అమెరికాలోని కార్లిస్లేలో ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ అవార్డు లభించింది. ఆయన డిఫెన్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫీల్, స్ట్రాటజిక్ స్టడీస్ , మిలిటరీ సైన్స్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలను కలిగి ఉన్నాడు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి పరమ విశిష్ట సేవా పతకం (PVSM), అతి విశిష్ట సేవా పతకం (AVSM) లభించాయి.

Read Also:Harom Hara Movie: క్లైమాక్స్‌ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!

1984 డిసెంబర్ 15న సైన్యంలో చేరారు
లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీకి సైనిక కార్యకలాపాల్లో సుమారు 40 ఏళ్ల అనుభవం ఉంది. అతను డిసెంబర్ 15, 1984న జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. తన సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలో అతను వివిధ కమాండ్‌లు, సిబ్బంది, బోధనా స్థానాల్లో పనిచేశాడు. లెఫ్టినెంట్ ఉపేంద్ర ద్వివేది కమాండ్ నియామకాలలో రెజిమెంట్ 18 జమ్మూ, కాశ్మీర్ రైఫిల్స్, బ్రిగేడ్ 26 సెక్టార్ అస్సాం రైఫిల్స్, ఐజీ, అస్సాం రైఫిల్స్ (ఈస్ట్), 9 కార్ప్స్ కమాండ్ కూడా ఉన్నాయి.

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన
దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ‘ప్రస్తుత డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీని తదుపరి ఆర్మీ చీఫ్‌గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 30 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదికి పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం లభించాయి. ద్వివేది తర్వాత అత్యంత సీనియర్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్, దక్షిణ మిలిటరీ కమాండ్ కమాండర్.

జనరల్ మనోజ్ పాండే పదవీకాలం పొడగింపు
ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలం మే 31తో ముగిసింది. ఎన్నికల ప్రక్రియలో అతని పదవీకాలాన్ని ఒక నెల పొడిగించారు. ఆర్మీ రూల్స్ ప్రకారం ఈ సర్వీస్ పొడిగింపు ఇచ్చినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు 1970వ దశకంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ జిజి బేవూర్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు.

Read Also:Chandrababu Naidu Oath Ceremony Live Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్