90వ దశకంలో బాలీవుడ్‌ను తన డ్యాన్స్‌తో, కామెడీతో ఊపేసిన స్టార్ హీరో గోవింద మళ్లీ వార్తల్లో నిలిచారు, అయితే ఈసారి ఆయన సినిమాల వల్ల కాదు. తన వ్యక్తిగత జీవితం మరియు భార్య సునీతా అహూజా చేసిన సంచలన వ్యాఖ్యల వల్ల గోవింద మళ్లీ వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు సునీత ఇప్పటికే చెక్ పెట్టారు. అయినప్పటికీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోవిందకు గతంలో ఇతర నటీమణులతో ఉన్న వివాహేతర సంబంధాల గురించి యాంకర్ ప్రశ్నించగా, సునీత చాలా ఓపెన్‌గా స్పందించారు. “అలాంటి అమ్మాయిలు బయట చాలా మందే ఉన్నారు, కానీ నువ్వు (గోవింద) కొంచెం అమాయకుడివి” అంటూ తన భర్తను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాక, “నీకు ఇప్పుడు 63 ఏళ్లు, మన అమ్మాయి టీనాకు పెళ్లి చేయాలి, కొడుకు యష్ కెరీర్ గురించి ఆలోచించాలి” అంటూ ఆయనకు హితవు పలికారు. ఈ వయసులో కూడా ఇంకా పాత విషయాల గురించి కాకుండా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని ఆమె పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Also Read:Kangana : మీలాంటి ద్వేషపూరితమైన వ్యక్తిని చూడలేదు.. రెహమాన్’పై కంగనా సంచలనం
ఈ ఇంటర్వ్యూలో సునీత తన కొడుకు యష్ వర్ధన్ అహూజా కెరీర్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు, గోవింద తన కొడుకుకు సినిమాల్లో సెటిల్ అవ్వడానికి ఎలాంటి సహాయం చేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. గోవింద కొడుకు అయినప్పటికీ, యష్ ఎప్పుడూ తన తండ్రిని సినిమా ఛాన్సుల కోసం సాయం కోరలేదని, యష్ అడగలేదని గోవింద కూడా తన వంతుగా ఎలాంటి చొరవ తీసుకోలేదని సునీత తెలిపారు. ఈ విషయంలో ఆమె గోవిందను సూటిగా ప్రశ్నించారట. “అసలు నువ్వు తండ్రివేనా కాదా? ఎందుకు కొడుకుకు సాయం చేయవు?” అని తాను గట్టిగా అడిగినట్లు సునీత పేర్కొన్నారు. గోవింద భార్య సునీత మొదటి నుండి చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు మరోసారి తన భర్త పర్సనల్ లైఫ్ గురించి, బాధ్యతల గురించి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి, నెటిజన్లు కూడా ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది సునీత ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు గోవింద వంటి స్టార్ హీరో తన కొడుకును ఎందుకు పట్టించుకోవడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
