Govinda Feeling Unwell : ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. జలగావ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వచ్చారు. అయితే అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి తిరిగి ముంబై చేరుకున్నారు. ముక్తానగర్, బోద్వాడ్, పచోరా, చోప్డాలో ప్రచారం చేసేందుకు గోవింద జలగావ్ చేరుకున్నారు. పచోరాలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రోడ్డుషోను సగంలోనే ఆపేసి ముంబై వెళ్లిపోయారు. అయితే అతడికి ఛాతిలో నొప్పి వచ్చినట్లు సమాచారం.
Read Also:Top Headlines @9AM : టాప్ న్యూస్!
గత నెలలో గోవింద ప్రమాదవశాత్తూ కాల్పులకు గురయ్యారు. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గోవిందకు సూచించారు. కాలికి గాయమై నెల రోజుల తర్వాత గోవింద ఆరోగ్యం మరోసారి క్షీణించింది. అయితే ఆయన ఆరోగ్యంపై పెద్దగా సమాచారం లేదు. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన గోవింద ఇటీవలే రాజకీయ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అందుకే వచ్చే మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈరోజు తన రోడ్ షోను ముగించుకుని, వైద్య సహాయం కోసం ముంబైకి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.
Read Also:Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్
ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా వీల్ చైర్ పై గోవింద కనిపించాడు. అయితే, దీపావళి సందర్భంగా నటుడి భార్య సునీత అహుజా అభిమానులందరికీ తన హెల్త్ అప్‌డేట్‌ను అందించింది. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని తెలిపారు. ర్యాలీ ప్రచారంలో గోవిందకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి అనేది ఇంకా వెల్లడి కాలేదు. గోవిందా ఆరోగ్యానికి సంబంధించిన ఈ వార్త ఆయన అభిమానుల్లో ఆందోళనను మరింత పెంచే అవకాశం ఉంది.