Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Govinda Health Deteriorated After Gunshot Injury Left Maharashtra Election Rally Chest Pain Admitted In Hospital

Govinda Feeling Unwell : ప్రముఖ బాలీవుడ్ నటుడికి అస్వస్థత

Published Date :November 17, 2024 , 9:36 am
By Rakesh Reddy
Govinda Feeling Unwell : ప్రముఖ బాలీవుడ్ నటుడికి అస్వస్థత
  • Follow Us :
  • google news
  • dailyhunt

Govinda Feeling Unwell : ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద అస్వస్థతకు గురయ్యారు. శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. జలగావ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వచ్చారు. అయితే అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి తిరిగి ముంబై చేరుకున్నారు. ముక్తానగర్, బోద్వాడ్, పచోరా, చోప్డాలో ప్రచారం చేసేందుకు గోవింద జలగావ్ చేరుకున్నారు. పచోరాలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రోడ్డుషోను సగంలోనే ఆపేసి ముంబై వెళ్లిపోయారు. అయితే అతడికి ఛాతిలో నొప్పి వచ్చినట్లు సమాచారం.

Read Also:Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

గత నెలలో గోవింద ప్రమాదవశాత్తూ కాల్పులకు గురయ్యారు. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గోవిందకు సూచించారు. కాలికి గాయమై నెల రోజుల తర్వాత గోవింద ఆరోగ్యం మరోసారి క్షీణించింది. అయితే ఆయన ఆరోగ్యంపై పెద్దగా సమాచారం లేదు. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన గోవింద ఇటీవలే రాజకీయ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అందుకే వచ్చే మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈరోజు తన రోడ్ షోను ముగించుకుని, వైద్య సహాయం కోసం ముంబైకి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

Read Also:Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్‌

ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా వీల్ చైర్ పై గోవింద కనిపించాడు. అయితే, దీపావళి సందర్భంగా నటుడి భార్య సునీత అహుజా అభిమానులందరికీ తన హెల్త్ అప్‌డేట్‌ను అందించింది. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని తెలిపారు. ర్యాలీ ప్రచారంలో గోవిందకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి అనేది ఇంకా వెల్లడి కాలేదు. గోవిందా ఆరోగ్యానికి సంబంధించిన ఈ వార్త ఆయన అభిమానుల్లో ఆందోళనను మరింత పెంచే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Govinda
  • Govinda Feeling Unwell
  • Govinda Firing
  • Govinda Gunshot
  • Govinda gunshot injury

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions