NTV Telugu Site icon

Governor Tamilisai: మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై

Governor Tamilisai

Governor Tamilisai

Governor Tamilisai Soundararajan: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు. మహిళా దినోత్సవం అనేది ఒక్క రోజు కాదు ప్రతిరోజు మహిళలని గౌరవించాలన్నారు. మహిళలు అన్నిరంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మిటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ , తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్, బాలీవుడ్ నటి & మోటివేషనల్ స్పీకర్ తానాజ్ ఇరానీ, ఫ్యాషన్ డిజైనర్ సోషలిస్ట్, ఫిట్‌నెస్ & కాన్షియస్ లివింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ శిల్పా రెడ్డి పాల్గొన్నారు.

Read Also: 10th Hall Tickets: రేపు పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల