NTV Telugu Site icon

Tamilisai Soundararajan: నడుస్తూ నడుస్తూ ..కిందపడ్డ గవర్నర్ తమిళిసై

Gov Tamilisai

Gov Tamilisai

దేశరాజకీయాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాట్ టాపిక్. ఆమె ఇటు తెలంగాణతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్….. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కిందపడ్డారు.

Read Also: Suspicion: అనుమానంతో నిండుప్రాణం బలి.. బాబాయ్‌ పై కొడవలితో దాడి

తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఆమె నడుస్తూ వేదిక వైపు వస్తూ ఉండగా…. కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు. ఆమె వెంట ఉన్న అధికారులు, సిబ్బంది ఆమె పైకి లేచేందుకు సాయం చేశారు. తాను కిందపడ్డా బ్రేకింగ్ న్యూస్, బిగ్ న్యూస్ అవుతుందని ఈ సందర్బంగా తమిళిసై సౌందరరాజన్ చమత్కరించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరుగుతుందో లేదో కానీ తాను కింద పడిపోవడం మాత్రం పెద్ద వార్తవుతుందన్నారు. మొత్తం మీద తమిళిసై స్వంత రాష్ట్రంలో చేసిన పర్యటన కూడా చర్చనీయాంశం అయింది.

Read Also: Magha Amavasya Bhakthi Tv Live: మాఘ అమావాస్యనాడు ఈ స్తోత్రాలు వింటే..

Show comments