Supreme Court: ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు నిజమైన అధికారం ఉంటుంది. వారు రాష్ట్రాలు, కేంద్రంలోని ప్రభుత్వాలలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ప్రతినిధులగా ఉంటారు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. గవర్నర్ రాష్ట్రానికి ఎన్నికైన అధిపతి కాదు, రాష్ట్రపతిచే నియమించబడిన రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి. కేబినెట్ రూపంలో ప్రభుత్వ సభ్యులే శాసనసభకు జవాబుదారీగా ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ‘ఎన్నికలేని రాష్ట్రాధిపతిగా గవర్నర్‌కు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు మాత్రమే అప్పగించబడ్డాయన్నారు. అయితే ఈ అధికారాలు సాధారణ చట్టాల ప్రక్రియను విఫలం చేయడానికి ఉపయోగించబడవని న్యాయ స్థానం అభిప్రాయపడింది.
Read Also:Suresh Raina: సురేశ్ రైనా మెరుపులు.. హైదరాబాద్ విజయం!
బిల్లుకు ఆమోదం పెండింగ్లో పెట్టడం ద్వారా గవర్నర్ శాసనసభను వీటో చేయలేరని, ఒకవేళ ఆమోదం తెలిపేందుకు నిరాకరిస్తే బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పంజాబ్ ప్రభుత్వ పిటిషన్‌పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసులో ధర్మాసనం నవంబర్ 10న తీర్పు వెలువరించింది. అయితే ఇప్పుడు తీర్పు కాపీని అందించారు. రాష్ట్రానికి ఎన్నికకాని అధినేతగా గవర్నర్‌కు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు అప్పగించినట్లు తీర్పులో పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీ చట్టాలను రూపొందించే సాధారణ ప్రక్రియను నిర్వీర్యం చేయడానికి గవర్నర్ ఈ అధికారాలను ఉపయోగించలేరు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లుకు ఆమోదం ఇవ్వకూడదని గవర్నర్ నిర్ణయించినట్లయితే, బిల్లును పునర్విచారణ కోసం శాసనసభకు పంపాల్సి ఉంటుందని తెలిపింది.
Read Also:Koata Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా.. హిట్ కొట్టినట్లేనా?