Site icon NTV Telugu

Governor Abdul Nazeer : నేడు తిరుపతిలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటన

Abdul Nazeer

Abdul Nazeer

నేడు తిరుపతిలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ 12వ స్నాతకోత్సవంకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అనంతపురం పర్యటనలో భాగంగా.. ఎస్కే యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహానికి గవర్నర్‌ నజీర్‌ నివాళులు అర్పించారు.

Also Read : Bhola Shankar : ఆ విషయంలో దర్శకుడు మెహర్ రమేష్ మిస్టేక్ చేసాడా..?

ఈ క్రమంలోనే నూతన అకాడమీ, హాస్టల్‌ భవనాలను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నజీర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో.. అన్ని అవకాశాలు ఉన్నాయి. విద్య శక్తివంతమైన ఆయుధం అన్న విషయం మరిచిపోవద్దు. కృషి, పట్టుదల, సృజనాత్మకత ఉంటే ఏదైనా సాధించవచ్చు. విద్యార్థులు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి. కేంద్రం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని కామెంట్స్‌ చేశారు.

Also Read : CM KCR : ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది

Exit mobile version